- Advertisement -
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది.రెండో ఆట ముగిసే సమయానికి భారత్ మూడు వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది.కెప్టెన్ విరాట్ కోహ్లితో పాటు ,వైస్ కెప్టెన్ రహానే క్రీజులో ఉన్నారు. విరాట్ కోహ్లి(82),రహానే(51) పరుగులతో క్రీజులో ఉన్నారు. రెండో రోజు మొదటి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియా ఆదిలోనే రెండ్లు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
మురళీ విజయ్ డకౌట్‌గా నిష్క్రమించగా, కేఎల్ రాహుల్(2) సైతం నిరాశపరిచాడు. చతేశ్వర పుజారాతో జత కలిసిన విరాట్ కోహ్లి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఈ జోడి మూడో వికెట్‌కు 74 పరుగులు జత చేసిన తర్వాత పుజారా(24; 103 బంతుల్లో 1 ఫోర్) పెవిలియన్ చేరాడు. ఇక ఆస్ట్రేలియా తన మొదటి ఇన్నింగ్స్‌లో 326 పరుగులకు ఆలౌటైంది.
- దళిత స్పీకర్ దూషణ, ఎర్రవల్లి ఘటనలపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం!
- NZ VS INS: హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న మ్యాచ్ టికెట్లు!
- అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత.. బీఆర్ఎస్ సభ్యులంతా సస్పెండ్!
- యువతపై కేసులా? చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం!
- బిగ్‌బాష్ లీగ్ పై ఐపీఎల్ ఓనర్ల కన్ను!
