Tuesday, May 14, 2024
- Advertisement -

ఆసియాక‌ప్ ఆడొద్దు సెహ్వాగ్‌.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన బీసీసీఐ

- Advertisement -

ఏషియా కప్ షెడ్యూల్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసిన టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. ఈ టోర్నీ నుంచి కోహ్లీ టీమ్‌కు వైదొల‌గాని సూచించారు. డిఫెండింగ్ చాంపియన్స్ ఇండియా ఆసియా కప్‌లో భాగంగా సెప్టెంబర్ 19న దాయాది పాకిస్థాన్‌తో తలపడనుంది.

టోర్నీలో అంతకు ముందు రోజు సెప్టెంబర్ 18న క్వాలిఫయర్ టీమ్‌తో కోహ్లి సేన ఆడాల్సి ఉంది. వరుసగా రెండు రోజులు వన్డే మ్యాచ్‌లు ఎలా ఆడుతారని వీరూ ప్రశ్నిస్తున్నాడు. రెండు వన్డేలకు మధ్య ఓ ప్లేయర్‌కు 24 నుంచి 48 గంటల సమయం ఉండాలని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.

ఎంతో వేడిగా ఉండే దుబాయ్‌లో వరుసగా రెండు రోజులు వన్డేలు షెడ్యూల్ చేశారు. ఇది కచ్చితంగా సరైన షెడ్యూల్ కాదు అని సెహ్వాగ్ స్పష్టంచేశాడు. షెడ్యూల్‌లో ఇలాగే సమస్య ఉంటే ఏషియా కప్‌లో ఇండియా ఆడకూడదు అని వీరూ అన్నాడు.

ఏషియా కప్ కోసం అంత బాధ పడాల్సిన పనిలేదు. ఆ టోర్నీ ఆడకండి. దాని బదులు టీమ్‌ను హోమ్ లేదా విదేశీ సిరీస్‌లకు సిద్ధం చేయండి. వరుసగా రెండు రోజులు ఎవరూ వన్డేలు ఆడరు అని సెహ్వాగ్ తేల్చి చెప్పాడు. ఇలాంటి షెడ్యూల్ వల్ల ఇండియాపై పాకిస్థాన్ పైచేయి సాధించే అవకాశం ఉందని వీరూ అన్నాడు.

వ‌రుస షెడ్యూల్‌పై బీసీసీఐ కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఒక మ్యాచ్ ఆడిన తర్వాత.. మరుసటి రోజే ఆటగాళ్లు ఎలా మ్యాచ్ ఆడతారంటూ..? ఇప్పుడు ఘాటుగా ప్రశ్నిస్తోంది. ఆసియా కప్ షెడ్యూల్‌ని అనాలోచితంగా వేసినట్లున్నారు. కనీసం ఆటగాళ్ల విశ్రాంతిని పరిగణలోకి తీసుకోలేదు. భారత జట్టు ఈరోజు మ్యాచ్ ఆడి.. మళ్లీ మరుసటి రోజే మ్యాచ్ ఎలా ఆడుతుంది..? అదీ.. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై..! ఇలాంటి షెడ్యూల్‌ని ఐసీసీ ఎలా ఆమోదించిందో అర్థంకావడం లేదు. కానీ.. మరోవైపు పాకిస్థాన్‌కి మాత్రం భారత్‌తో మ్యాచ్‌కి ముందు రెండు రోజుల విశ్రాంతి దొరుకుతోంది’ అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -