విరాట్ కోహ్లి గైర్హాజరీలో భారత జట్టు ఆసియా కప్‌ను సొంతం చేసుకుంది. ఒక్క మ్యాచ్‌లోనూ ఓడకుండానే టైటిల్ కైవసం చేసుకుంది. భారత్ ఆసియా కప్ గెలవడం ఇది ఏడోసారి కావడం గమనార్హం. ఫైనల్లో బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో చివరి బంతికి భారత్ థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది
భారత్ విజయాన్ని తట్టుకోలేని బంగ్లా అభిమానులు భారత్‌పై ప్రతీకారం తీర్చుకున్నారు. భారత్ చేతిలో ప్రతీకారాన్ని జీర్ణించుకోలేని బంగ్లా ఫ్యాన్స్ నీచమైన చర్యకు పాల్పడ్డారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేశారు. సైబర్ సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ (సీఎస్ఐ) పేరుతో ఓ హ్యాకింగ్ గ్రూప్ ఈ దిగజారుడు చర్యకు పాల్పడింది.
బంగ్లా అభిమానుల అక్కసకు అసలు కారణం బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ లిటన్ దాస్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 117 బంతుల్లో 121 పరుగులు చేసిన అతణ్ని ధోనీ మెరుపు వేగంతో స్టంపౌట్ చేశాడు. థర్డ్ అంపైర్ చాలా సేపు రిప్లే చూసి దాస్ అవుటని ప్రకటించాడు. కానీ అంపైర్ నిర్ణయం పట్ల బంగ్లాదేశ్ క్రికెట్ ఫ్యాన్స్ అసంతృప్తికి లోనయ్యారు. అతడు ఔట్ కాకుండానే.. భారత్‌కు అనుకూలంగా అంపైర్ నిర్ణయాన్ని ప్రకటించాడని మండిపడ్డారు.
ఈ ఫొటోలను పోస్టు చేసిన హ్యాకర్లు, లిటన్ దాస్ ఎలా అవుటయ్యాడో చూశాక కూడా క్రికెట్ జెంటిల్మన్ గేమ్ ఎలా అవుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఐసీసీ క్షమాపణ చెప్పాలని, బహిరంగంగా క్షమాపణ చెప్పడం ఇష్టం లేకుంటే లిటన్ దాస్‌ను అవుట్ గా ప్రకటించిన అంపైర్లపై చర్యలు తీసుకోవాలన్నారు.
కోహ్లి వెబ్‌సైట్‌ను సైబర్ సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ గ్రూప్ హ్యాక్ చేసిందని ఢాకా ట్రిబ్యూన్ తెలిపింది. ఇది భారతీయులను అవమానించడం కోసం కాదని, తమ జట్టుకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా నిరసన మాత్రమేనని హ్యాకర్లు తెలిపారు. క్రికెట్లో ప్రతి దేశాన్ని సమానంగా చూడాలని వారు కోరారు.
https://twitter.com/dharmasena_k/status/1047141539141443584
