Tuesday, May 14, 2024
- Advertisement -

పాక్‌తో ఆడితే ఎవ‌రూ చావ‌రులే…

- Advertisement -

ఆసియా కప్‌లో భారత్ జట్టు బ్యాక్ టు బ్యాక్ వన్డేలాడినంత మాత్రానా.. ఎవరూ చావరని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డీన్ జోన్స్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. యూఏఈ వేదికగా సెప్టెంబరు 15 నుంచి 28 వరకు ఆసియా కప్ జరగనుండగా.. భారత్ జట్టు సెప్టెంబరు 18న క్వాలిఫయర్ జట్టు‌తో తొలి మ్యాచ్ ఆడి ఆ తర్వాత 19న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో రెండో మ్యాచ్ ఆడాల్సి ఉంది.

ఐసీసీ రూపొందించిన ఈ షెడ్యూల్‌ని ఇటీవల తప్పుబట్టిన బీసీసీఐ.. తెలివి తక్కువ షెడ్యూల్‌గా అభివర్ణించింది. పాక్‌తో కీలకమైన మ్యాచ్‌కి ముందు కనీసం ఒక్కరోజు కూడా భారత ఆటగాళ్లకి విశ్రాంతి లేకపోతే ఎలా..? అని ప్రశ్నించింది. తాజాగా ఈ వాదనపై డీన్ జోన్స్ వివాదాస్పద రీతిలో స్పందించాడు.

ఇంగ్లాండ్ పర్యటనలో మేము వరుసగా 11 రోజులు మ్యాచ్‌లు ఆడిన సందర్భాలు నాకింకా గుర్తున్నాయి. ఆసియా కప్‌లో భారత్ జట్టు విరామం లేకుండా వరుసగా రెండు వన్డేలు ఆడటంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని నేను అనుకుంటున్నా. దానికి తోడు ఇప్పుడు ఉండే అథ్లెట్స్‌ చాలా ఫిట్‌గా కనిపిస్తున్నారు. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా.. అలా రెండు రోజులు వన్డేలాడటం వల్ల ఎవరూ చావరు.. బాగానే ఉంటారు’ అని డీన్ జోన్స్ వెల్లడించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -