- Advertisement -
డోపింగ్‌కు పాల్పడి ఓ వికెట్ కీపర్ అడ్డంగా దొరికిపోయాడు. పంజాబ్ వికెట్ కీపర్ అభిషేక్ గుప్తాపై బీసీసీఐ 8 నెలల సస్పెన్షన్ వేటు వేసింది. నిషేధిత ఉత్ప్రేరకం టెర్బుటలైన్ తీసుకున్నట్లు పరీక్షల్లో తేలడంతో సస్పెండ్ చేశారు. జనవరి నిర్వహించిన బీసీసీఐ డోపింగ్ టెస్టింగ్ ప్రోగ్రామ్‌లో అభిషేక్ నిషేధిత ఉత్పేరకం వాడినట్లు తేలింది.
ఈ విషయాన్ని గురువారం బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది.అయితే దీనిపై అభిషేక్ మాట్లాడుతు తను డాక్టర్ సూచన మేరకే వాడినట్లు అభిషేక్ ఇచ్చిన వివరణతో నిషేధాన్ని 8 నెలలకే పరిమితం చేసింది. డోపింగ్‌కు పాల్పడిన తొలి పంజాబ్ క్రికెటర్‌గా అభిషేక్ కావడం గమనార్హం.
