Sunday, May 5, 2024
- Advertisement -

ధోనీకి విలువైన స‌ల‌హా ఇచ్చిన సేహ్వాగ్‌…

- Advertisement -

ఇటీవలి కాలంలో తన స్థాయికి తగ్గట్టు ఆడటం లేదనె విమ‌ర్శ‌లు మాజీకెప్టెన్ మ‌హేంద్ర‌సింగ్‌ధోనిపై విమ‌ర్శ‌లు తాకిడి ఎక్కువుతోంది. ముఖ్యంగా న్యూజిలాండ్ తో జరిగిన రెండో టీ-20 మ్యాచ్ లో పేవ‌ల‌మైన ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వ‌డంతో విమ‌ర్శ‌లు ఎక్కువ‌య్యాయి. రెండో టీ20లో ధోని నిల‌దొక్కుకుని కూడా, చేయాల్సిన రన్ రేట్ అధికంగా ఉన్న వేళ, నింపాదిగా ఆడుతూ ఉండిపోయిన మహేంద్ర సింగ్ ధోనీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇప్ప‌టికె వీవీఎస్‌ల‌క్ష్మ‌న్‌కూడా ధోనిపై విమ‌ర్శ‌లు చేసిన‌సంగ‌తి తెలిసిందే. ధోని టీ20 మ్యాచ్‌ల‌నుంచి త‌ప్పుకొని యువాట‌గాల్ల‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని సూచించారు. విమ‌ర్శ‌ల వేల వీరేంద్ర‌సేహ్వాగ్ ధోనికి విలువైన స‌ల‌హా ఇచ్చాడు. న్డేలతో పోలిస్తే, టీ-20ల్లో పరిస్థితి వేరుగా ఉంటుందని, ఇది ధోనీకి తెలియని విషయమేమీ కాదని చెబుతూనే, మిడిల్ ఆర్డర్ లో వచ్చే ధోనీ, నిలదొక్కుకునేందుకు ప్రయత్నించకుండా, తొలి బాల్ నుంచే పరుగులు చేసేందుకు ప్రయత్నించాలని అన్నాడు. ఈ ప్రయత్నంలో అవుట్ అయి పోయినా ఫర్వాలేదని చెప్పాడు.

క్రీజులో పాతుకుపోయి పరుగులు చేయకుండా ఉండటంతో పాటు, ఆడిన నాలుగు బంతులనూ బౌండరీలకు పంపితే, టీ-20ల్లో మేలు కలుగుతుందని చెప్పాడు. సాధించాల్సిన పరుగులు ఎక్కువగా కనిపిస్తున్నప్పుడు, ధోనీ వంటి ఆటగాడు, వేగాన్ని పెంచలేకపోతే, ఆ ప్రభావం తరువాత వచ్చే వారిపై పడుతుందని అన్నాడు. రెండో టీ-20 మ్యాచ్ తరువాత ధోనీని అనిల్ కుంబ్లే వంటి ఆటగాళ్లు విమర్శించగా, గవాస్కర్ వంటి వారు వెనకేసుకు వచ్చిన సంగతి తెలిసిందే.

పొట్టి ఫార్మాట్‌లో ధోని తన పాత్ర ఏంటో తెలుసుకోవాలి. భారీ స్కోర్లు ఛేదించేటపుడు… ధోని తొలి బంతి నుంచే పరుగులు తీయాలి. టి20ల్లోనూ టీమిండియాకు అతని అవసరం ఉంది. ఆటకు ఎప్పుడు టాటా చెప్పాలో అతనికి బాగా తెలుసు. ఏ ఒక్క యువ ప్రతిభావంతుడి అవకాశాల్ని అతను దెబ్బతీయడు’ అని సెహ్వాగ్‌ అన్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -