Thursday, May 16, 2024
- Advertisement -

ఇలా అయితే జ‌ట్టులో క‌ష్ట‌మే

- Advertisement -

‘ఆల్‌రౌండర్ హార్దిక్‌ పాండ్యా సౌతాఫ్రికా పర్యటనలో ఘోరంగా విఫలం చెందాడు. ఒక్క మొద‌టి టెస్ట్ మ్యాచ్‌లో మిన‌హా మిగిలిన సిరీస్ మొత్తం త‌న ఆట‌తో అంద‌రిని నిరాశ‌కు గురి చేశాడు.నిజానికి ఈ టూర్‌కు ముందు హార్దిక్‌ పాం డ్యాపై భారీ అంచనాలున్నాయి. కొన్ని నెలల కిందట శ్రీలంక గడ్డపై అతని ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చూసి మరో కపిల్‌ దేవ్‌ కోసం ఎంతోకాలంగా చూస్తున్న నిరీక్షణ ఫలిస్తున్నట్టేనని అంతాభావించారు. సౌతాఫ్రికా గడ్డపై అతను సత్తా చాటుతాడని కెప్టెన్‌ కోహ్లీతో పాటు మాజీలు.. విశ్లేషకులు భరోసాతో ఉన్నారు. ఈ టూర్‌కు ఎంపికచేసేందుకుగాను స్వదేశంలో లంకతో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో ఆడించకుండా పాండ్యాకు విశ్రాంతి ఇచ్చారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కేప్‌టౌన్‌ తొలి టెస్టులో భారత బ్యాటింగ్‌ విఫలమైన చోట.. పాండ్యా కౌంటర్‌ అటాకింగ్‌ ఆటతో 93 పరుగులు చేసి జట్టును కుప్పకూలకుండా కాపాడాడు. విదేశీ గడ్డపై.. అత్యంత పటిష్ట మైన బౌలింగ్‌ను ఎదుర్కొంటూ పాండ్యా ఆడిన ఇన్నింగ్స్‌ చూసి ఫిదా అయ్యారంతా. క్రికెట్‌ పండితులు సైతం హార్దిక్‌ను మరో కపిల్‌ అంటూ పొగిడేశారు.

కానీ, రెండో టెస్టుకు వచ్చేసరికే విమర్శకులు అభిప్రాయాన్ని మార్చుకున్నారు. కనీసం బ్యాటును క్రీజులో ఉంచకుండా అత్యంత నిర్లక్ష్యంగా రనౌట్‌ కావడాన్ని… స్లిప్‌ మీదుగా అడ్డంగా షాట్‌ ఆడి అవుటైన తీరును తీవ్రంగా ఆక్షేపించారు. వన్డేల్లో అయితే అత్యంత దారుణమైన ఆట తీరును కనబరిచాడు. ప్రత్యర్థిపై సంపూర్ణ ఆధిపత్యం చెలాయిస్తూ భారత్‌ 5-1తో కైవసం చేసుకున్న ఈ సిరీస్‌లో పాండ్యా నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 8.66 సగటుతో 26 పరుగులే చేశాడు. ఇలా ఆడితే జ‌ట్టులో కొన‌సాగ‌డం క‌ష్టంగా మారునుంది.అస‌లే టీం ఇండియాలో పోటీ తీవ్ర‌త ఎక్కువుగా ఉన్న సంగ‌తి పాండ్యాకు కూడా తెలుసు. పాండ్యా త‌న ఆట‌ను మార్చుకుంటాడో లేక జట్టులో స్థానం కొల్పోతాడో చూద్దాం .

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -