Saturday, May 4, 2024
- Advertisement -

రెండో టెస్ట్ లో విజయానికి అడుగు దూరంలో కోహ్లీసేన…

- Advertisement -

మొదటి టెస్టులో విండీస్ పై ఘనవిజయం సాధించిన టీమిండియా రెండో టెస్టులోనూ తన జోరును కొనసాగిస్తోంది. టెస్ట్ సిరీస్ క్లీన్ స్విప్ కు అడుగు దూరంలో నిలించింది. జమైకా వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో 468 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్ జట్టు.. ఆటలో మూడోరోజైన ఆదివారం ఆట ముగిసే సమయానికి 45/2తో నిలిచింది.ఫాస్ట్ బౌలర్లకి అతిగా అనుకూలిస్తున్న పిచ్‌పై ఆ మిగిలిన 8 వికెట్లనూ పడగొట్టి విజయం సాధించాలని పట్టుదలతో ఉంది.

పేస్ బౌలర్ బుమ్రా దెబ్బకి వెస్టిండీస్‌ని 117 పరుగులకే కుప్పకూలింది.టీమిండియాకి ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 299 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. మొదటి ఇన్నింగ్స్‌లో ఇండియా 47.1 ఓవర్లు వెయ్యగా… వాటిలో 36 ఓవర్లను పేసర్ల ద్వారా వేయించింది. ఫాలోఆన్ కి అవకాశం ఇవ్వకుండా భారత్ బ్యాటింగ్ ను ప్రారంభించింది.

స్కోర్ 9 పరుగుల దగ్గర ఐదో ఓవర్‌లోనే ఎల్బీడబ్ల్యూగా మయాంక్ అగర్వాల్ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత స్కోర్ 36 పరుగుల దగ్గర కేఎల్ రాహుల్, ఆ వెంటనే విరాట్ కోహ్లీ పెవిలియన్ బాట పట్టారు. స్కోర్ 54 పరుగుల దగ్గర పుజారా వికెట్ కోల్పోయింది టీమిండియా.మూడో రోజు టీమిండియా… 4 వికెట్లు కోల్పోయి… 168 పరుగులు చేసింది. హనుమ విహారీ, రహానే క్రీజులో ఉన్నారు. ఫలితంగా టీమిండియా 467 పరుగుల ఆధిక్యంలో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.డార్రెన్ బ్రావో (18), షమర్ష్ బ్రూక్స్ (4) క్రీజ్‌లో ఉన్నారు. ఆట నాలుగో రోజున 8వికెట్లు తీసి… త్వరగా సెకండ్ ఇన్నింగ్స్ ముగించి… సిరీస్‌ క్లీన్ స్వీప్ చెయ్యాలని టీమిండియా టార్గెట్‌గా పెట్టుకుంది.

శుక్రవారం ఆరంభమైన ఈ టెస్టు మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 416 పరుగులకి ఆలౌటైంది. జట్టులో హనుమ విహారి (111: 225 బంతుల్లో 16×4) శతకం సాధించగా.. మయాంక్ అగర్వాల్ (55), విరాట్ కోహ్లి (76), ఇషాంత్ శర్మ (57) హాఫ్ సెంచరీలు సాధించిన సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -