Thursday, May 16, 2024
- Advertisement -

కేప్‌టౌన్ వన్డేలో భార‌త్ రికార్డుల మోత….

- Advertisement -

దక్షిణాఫ్రికాతో బుధవారం కేప్‌టౌన్ వన్డేలో భారత్ ఘన విజయం సాధించడంతోపాటు పలు రికార్డులను సృష్టించింది. ఈ మ్యాచ్‌ లో సఫారీలను 124 పరుగుల తేడాతో ఓడించిన భారత్, వరుసగా మూడు వన్డేలను గెలుచుకుని 3-0 ఆధిక్యం సాధించింది. సిరీస్ గెలుపు కోసం భారత్ మరో విజయం సాధిస్తే సరిపోతుంది. ఇక ఈ మ్యాచ్‌లో భారత్ అనేక రికార్డులు న‌మోద‌య్యాయి.

న‌మోద‌యిన రికార్డులు…

: ఓ ద్వైపాక్షిక సిరీస్‌లో దక్షిణాఫ్రికా 0-3తో వెనుకబడడం ఇదే తొలిసారి
: దక్షిణాఫ్రికాలో దక్షిణాఫ్రికాపై భారత్ అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించడం ఇదే ప్రథమం

:మూడు వన్డేల్లోనూ కలిపి భారత స్పిన్నర్లు 21 వికెట్లు తీసుకున్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో ఆ దేశ గ‌డ్డ‌పై ఇన్ని వికెట్లు తీసుకోవడం కూడా ఇదే మొదటిసారి

: ఈ మ్యాచ్‌లో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ అజేయంగా 160 పరుగులు చేశాడు. 1983లో టర్న్‌బ్రిడ్జ్ వెల్స్‌లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో కపిల్ దేవ్ అజేయంగా 175 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఓ భారత కెప్టెన్ విదేశాల్లో సాధించిన అత్యధిక వ్యక్తిగత పరుగులు ఇవే.

:12.10 సగటుతో రోహిత్ శర్మ అత్యంత చెత్త గణాంకాలు నమోదు చేశాడు. దక్షిణాఫ్రికాలో భారత బ్యాట్స్‌మన్ అత్యంత చెత్త సగటు ఇదే.

:ఈ వన్డేల్లో సెంచరీ కోసం కోహ్లీ 119 బంతులు ఆడాడు. సెంచరీ కోసం ఇన్ని బంతులు ఆడడం కోహ్లీకి ఇదే తొలిసారి

:కెప్టెన్‌గా కోహ్లీ 12 సెంచరీలు సాధించి మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేరుపై ఉన్న రికార్డును తుడిచేశాడు. గంగూలీ 142 ఇన్నింగ్స్‌లలో 11 సెంచరీలు చేయగా గంగూలీ 43 ఇన్నింగ్స్‌లలోనే 12 సెంచరీలు బాదాడు.

:భారత దిగ్గజ క్రికెటర్, అత్యధిక వన్డే శతకాలు (49) బాదిన సచిన్ తెందుల్కర్ తన 34వ శతకాన్ని 298 ఇన్నింగ్స్‌ల్లో అందుకుంటే.. విరాట్ కోహ్లి తాజాగా 205 ఇన్నింగ్స్‌లోనే ఆ మార్క్ చేరుకున్నాడు.

:వన్డేల్లో 100 సిక్సర్లు కొట్టిన భారత మూడో క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు. అతని కంటే ముందు వరుసలో మహేంద్రసింగ్ ధోని (216), రోహిత్ శర్మ (165) ఉన్నారు.

: వన్డేల్లో బౌండరీలు ద్వారా కాకుండా.. కేవలం వికెట్ల మధ్య పరుగెత్తుతూ 100 పరుగులు చేసిన భారత తొలి క్రికెటర్‌గా విరాట్ కోహ్లి నిలిచాడు. ప్రపంచ వ్యాప్తంగా వన్డే చరిత్రలో ఐదో బ్యాట్స్‌మెన్.

: ప్రస్తుతం జరుగుతున్న వన్డే సిరీస్‌లో కోహ్లి ఇప్పటి వరకు చేసిన పరుగులు 318. దక్షిణాఫ్రికా జట్టుపై దక్షిణాఫ్రికాలో ఓ పర్యాటక బ్యాట్స్‌మెన్ ద్వైపాక్షిక సిరీస్‌లో ఇన్ని పరుగులు చేయడం ఇదే తొలిసారి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -