Sunday, May 5, 2024
- Advertisement -

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భార‌త్‌…

- Advertisement -

జోహ‌న్నెస్ బ‌ర్గ్‌లో స‌ఫారీ,భార‌త్ మ‌ధ్య జ‌రుగుతున్న నాలుగో వ‌న్డేలో టాస్ గెలిచి కోహ్లీసేన బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరు జట్లలో స్వల్ప మార్పు చోటు చేసుకున్నాయి. భారత జట్టులో గాయంతో కేదార్‌ జాదవ్‌ దూరం కాగా అతని స్థానంలో యువ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ జట్టులోకి వచ్చాడు. ఇప్ప‌టికే ఆరువ‌న్డేల సిరీస్‌లో భాగంగా 3-0 తో ఆత్మ‌విశ్వాసంతో నాలుగో వ‌న్డే బ‌రిలోకి దిగుతోంది. భార‌త్ టీంలో కెప్టెన్ కోహ్లీ, శిఖ‌ర్ ధావ‌న్ మిగితా బ్యాట్స్‌మెన్‌లు మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇక బౌల‌ర్లు కూడా త‌మ పాత్ర నిర్వ‌హిస్తున్నారు. గాయం కార‌నంగా మూడు వ‌న్డేల‌కు దూరం అయిన స‌ఫారీ స్టార్ ఆటగాడు డివిలియ‌ర్స్ జ‌ట్టులోకి రావ‌డం సౌతాఫ్రికాకు క‌ల‌సి వ‌చ్చే అశం.

జొహ‌న్నెస్ బ‌ర్గ్ వేదిక‌గా జ‌రుగుతున్న నాలుగో వ‌న్డేలో సౌతాఫ్రికా జ‌ట్టు పింక్ డ్ర‌స్ లో ద‌ర్శ‌న‌మివ్వ‌నుంది. రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన పెంచే కార్యక్రమంలో భాగంగా ఈ మ్యాచ్‌ను ‘పింక్‌ వన్డే’గా పరిగణిస్తున్నారు. సంవత్సరంలో ఒకసారి ఈ మ్యాచ్‌ కోసం సఫారీ ఆటగాళ్లు గులాబీ దుస్తులతో బరిలోకి దిగడం సాంప్రదాయంగా వస్తోంది. ఈ మ్యాచ్‌ ద్వారా వచ్చే ఆదాయంలో పది లక్షల సౌతాఫ్రికా ర్యాండ్‌లను స్థానిక చార్లొట్‌ మ్యాక్సికే అకడమిక్‌ హాస్పిటల్‌కు అందజేస్తారు. 2011 నుంచి దక్షిణాఫ్రికా ఐదు వన్డేల్లో పింక్‌ దుస్తులతో బరిలోకి దిగగా ఐదింటిలోనూ విజయం సాధించడం విశేషం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -