భీకరమైన ఫామ్ లో ఉన్న పేస్ బౌలర్ బూమ్రాపై కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. బూమ్రా లాంటి బౌలర్ తమ జట్టులో ఉండటం తమ అద్రుష్టమన్నారు.టి20 ఆటగాడిగా ముద్ర పడిన ఓ క్రికెటర్ ఇప్పుడు అన్ని ఫార్మాట్లలో తిరుగులేని ప్రదర్శన కనబరుస్తుండడం మామూలు విషయం కాదని అన్నాడు.
ఒక ఆటగాడిపై ఫలానా ఫార్మాట్ కే పనికొస్తాడని ముద్రవేయడం ఎంత తప్పో బుమ్రా నిరూపించాడని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. తాజాగా విండీస్ తో జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో బుమ్రా వేసిన స్పెల్ భయంకరం అని, అలాంటి బౌలింగ్ ను తాను ఇంతకు ముందెప్పుడూ చూడలేదని అన్నాడు.
అంతర్జాతీయ క్రికెట్ లో తనదైన ముద్ర వేయాలని కోరుకున్న బుమ్రా, క్రమశిక్షణ, అంకితభావంతో తనను తాను మలుచుకున్నాడని కొనియాడాడు. బుమ్రా ట్రయినింగ్, అతడు తీసుకునే ఆహారం చాలా ప్రత్యేకంగా ఉంటుందని వివరించాడు. అలాంటి ఫాస్ట్ బౌలర్ తన జట్టులో ఉండడం లక్కీగా భావిస్తున్నానని పేర్కొన్నాడు.
బూమ్రా జోరుమీదుంటె మొదటి 5 -6 ఓవర్లలోనె కొత్త బంతితో తన పని తాను పూర్తి చేస్తాడన్నారు. మరో వైపు ఆల్ రౌండర్ జడేజాపై కూడా ప్రశంసలు కురిపించారు.బ్యాట్, బంతితోనూ రానిస్తున్నారన్నారు. హనుమ విహారి తను ఏంటో నిరూపించుకున్నారన్నారు. అత్యంత ఒత్తిడిలో, సవాల్ విసిరే వికెట్ పై బ్యాటింగ్ అద్భుతమని ప్రశంసించారు.
