- Advertisement -

క్రికెట్ ఫ్యాన్స్‌కు అదిరే న్యూస్..ఒలింపిక్స్‌లో క్రికెట్

- Advertisement -

క్రికెట్ లవర్స్‌కు నిజంగా ఇది గుడ్ న్యూస్. అభిమానులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న న్యూస్ రానే వచ్చింది. 2028లో లాస్ ఏంజిల్స్ వేదికగా జరిగే ఒలింపిక్స్‌లో క్రికెట్‌ ఆడేందుకు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఐఓసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు అధ్యక్షుడు థామస్ బాచ్ ఈ విషయాన్ని వెల్లడించారు.

ఈ సారి ఒలింపిక్స్‌లో 5 కొత్త క్రీడలకు అనుమతించగా అందులో క్రికెట్‌ కూడా ఉండనుందని తెలిపారు. క్రికెట్‌తో పాటు బేస్‌బాల్‌/సాఫ్ట్‌బాల్‌, ఫ్లాగ్ ఫుట్‌బాల్‌, స్క్వాష్‌, లాక్రోసీ క్రీడలు యాడ్ కానున్నాయి. ఇక క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో ప్రవేశ పెట్టాలన్న డిమాండ్ ఎప్పటినుండో ఉంది.ఆ కోరిక ఇప్పటికి నెరవేరింది.

1900 సంవత్సరం పారిస్‌లో జరిగిన ఒలింపిక్ క్రీడల్లో క్రికెట్‌ని ఆడించగా దాదాపు 128 ఏళ్ల తర్వాత క్రికెట్ రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. అయితే టి20 ఫార్మాట్ లో ఈ మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది జరిగిన బర్మింగ్ హామ్ కామన్వెల్త్ గేమ్స్ లో మహిళల క్రికెట్ కు అనుమతి ఇచ్చారు. అది సక్సెస్ అయ్యింది. దీంతో పురుషుల క్రికెట్‌కు అనుమతించగా అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -