Wednesday, May 15, 2024
- Advertisement -

టీమిండియాపై గెలవాలంటే..ఇంగ్లాండ్ ఈ పని చేయాల్సిందే!

- Advertisement -

వరల్డ్ కప్ తర్వాత టీమిండియా వరుస సిరీస్‌లతో బిజీగా ఉంది. ఇటీవలె దక్షిణాఫ్రికా టూర్‌ని ముగించుకున్న టీమిండియా ఈ నెల 11 నుండి ఆప్ఘానిస్తాన్‌తో టీ20 సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్ ముగిసిన వెంటనే ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో తలపడనుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌లో టీమిండియా అగ్రస్థానాన్ని నిలుపుకోవాలంటే ఈ సిరీస్ చాలా కీలకం.

అటు ఇంగ్లాండ్‌కు టీమిండియా సిరీస్ ప్రతిష్టాత్మకం కాగా ఆ జట్టు మాజీ స్టార్ స్పిన్నర్ మాంటి పనేసర్ ఆటగాళ్లకు కీలక సూచనలు చేశారు. భారత్‌లోని టర్నింగ్ పిచ్‌లపై టీమిండియా బ్యాటర్లు స్పిన్‌లో ప్రతిదాడికి దిగడానికి ప్రయత్నిస్తారని కాబట్టి ఎంతవీలైతే అంత త్వరగా రోహిత్ శర్మను ఔట్ చేయాలని సూచించాడు. రోహిత్ రికార్డులు మాములుగా ఉండగా అందుకే అతడిని త్వరగా ఔట్ చేస్తేనే ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ విజయం సాధించగలదన్నాడు.

రోహిత్‌ను తొందరగా ఔట్ చేస్తే టీమిండియా ప్లాన్-Bకి వెళ్తుందని అప్పుడు ఆ జట్టు ఆటగాళ్లపై ఒత్తిడి తీసుకురావచ్చని ఇది టెస్టుల్లో ఇంగ్లాండ్ గెలుపులో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఇక టీమిండియాకు ప్రధాన ఆధారం అశ్విన్‌ అని కొనియాడాడు పనేసర్. అశ్విన్ విభిన్న బంతుల్ని సంధించేందుకు సిద్ధంగా ఉంటాడని..క్లిష్ట పరిస్థితుల్లోనూ రాణించడం అశ్విన్ ప్రత్యేకత అన్నాడు. నవరి 25 నుంచి ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టెస్టు ఉప్పల్‌లో జరగనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -