Sunday, May 5, 2024
- Advertisement -

ప్రపంచకప్ ఫైనల్‌లో ధోనీ ఫినిష్ సిక్స్.. అక్కడే న్యూజిలాండ్‌తో పోరు

- Advertisement -

సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో పోరుకు భారత్ జట్టు రెడీ అవుతోంది. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ఈ ఆదివారం తొలి వన్డే జరగనుంది. వాంఖడే మైదానం అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది.. 2011 ప్రపంచకప్‌‌ ఫైనల్లో భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ కొట్టిన మ్యాచ్ ఫినిష్ సిక్స్. ఆ సిక్స్ ఆ మ్యాచ్ ని ఏ స్థాయికి తీసుకెళ్లిందో అందరికి తెలిసిందే.

28 ఏళ్ల తర్వాత టీమిండియాకి వన్డే ప్రపంచకప్ అందించిన ఆ సిక్సర్ భారత్ క్రికెట్ చరిత్రపై చెరగని ముద్ర వేసింది. ఈ విషయంనే ఇంకోసారి గుర్తు చేస్తూ.. బీసీసీఐ ఓ వీడియోని క్రికెట్ అభిమానులతో పంచుకుంది. మైదానంలో ఏర్పాటు చేసిన నెట్స్‌లో గత రెండు రోజులుగా ధోనీ హిట్టింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ‘వాంఖడే స్టేడియంలో మహేంద్రసింగ్ ధోనీ ఎప్పుడు భారీ షాట్ కొట్టినా.. అది 2011 ప్రపంచకప్ ఫైనల్‌లో కొట్టిన ఫినిష్ సిక్స్‌ని గుర్తుకు తెస్తుంది’ అని బీసీసీఐ రాసుకొచ్చింది.

భారత్ బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టుతో తొలి ప్రాక్టీస్ వన్డేలో ఓడిన న్యూజిలాండ్.. రెండో వన్డేలో మాత్రం సాధికారికంగా బ్యాటింగ్ చేసి గెలుపొందింది. రాస్ టేలర్, టామ్ లాథమ్ శతకాలతో ఫామ్‌లో ఉన్నారు. ఇక భారత్ ఇటీవల ఆస్ట్రేలియాని 4-1తేడాతో ఓడించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -