Wednesday, May 15, 2024
- Advertisement -

అరుదైన రాకార్డ్‌ను సాధించిన ఇంగ్లాండ్ ఆల్‌రౌండ‌ర్ అండ‌ర్స‌న్‌…

- Advertisement -

న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్‌ బౌలర్‌ జేమ్స్‌ అండర్సన్‌ అరుదైన ఘనతను సాధించాడు. సుదీర్ఘ టెస్టు కెరీర్‌లో 136 మ్యాచ్‌లాడిన అండర్సన్ మొత్తం 30,074 బంతులు విసిరి.. టెస్టు ఫార్మాట్‌లో ఎక్కువ బంతులు విసిరిన ‘ఫాస్ట్‌ బౌలర్‌’గా రికార్డు నెలకొల్పాడు. ఇప్పటి వరకు వెస్టిండీస్ పేసర్ వాల్ష్ 132 మ్యాచ్‌ల్లో 30,019 బంతులతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. తాజాగా అండర్సన్‌ ఆ రికార్డుని కనుమరుగు చేశాడు. వాల్ష్‌ కెరీర్‌లో మొత్తం 519 వికెట్ల తీయగా.. అండర్సన్ ఇప్పటికే 531 వికెట్లతో కొనసాగుతుండటం విశేషం.

మొత్తంగా టెస్టుల్లో అత్యధిక బంతులు విసిరిన బౌలర్ల జాబితాలో శ్రీలంక స్పిన్నర్ మురళీ ధరన్ 133 మ్యాచ్‌ల్లో 44,039 బంతులతో అగ్రస్థానంలో ఉన్నాడు. తర్వాత భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే 132 మ్యాచ్‌ల్లో 40,850, ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్‌వార్న్ 145 మ్యాచ్‌ల్లో 40,705 ఉన్నారు. మొత్తంగా ఈ జాబితాలో అండర్సన్‌ది నాలుగో స్థానం కాగా.. పేసర్ల జాబితాలో మాత్రం అగ్రస్థానం.

ప్రస్తుతం ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో 887పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా, దక్షిణాఫ్రికా బౌలర్‌ రబడా 899 పాయింట్లతో తొలి స్థానంలో కొనసాగుతున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -