మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో జట్టులో స్థానం కోల్పోవడమేకాక నిషేధానికి గురైన పాకిస్థానీ క్రికెటర్ డానిష్ కనేరియా ఎట్టకేలకు చేసిన తప్పును అంగీకరించాడు. తన పరిస్థితిని అర్థం చేసుకోవాలని పాక్ క్రికెట్ బోర్డ్, అభిమానులు, దేశ ప్రజలను కోరుకుంటున్నానని.. దయ చేసి తనను క్షమించాలని వేడుకున్నాడు.
61 టెస్టుల్లో 261 వికెట్లు తీసిన ఈ పాకిస్థానీ స్పిన్నర్ తన స్పిన్ మాయాజాలంతో సొంత జట్టుకు ఎన్నో విజయాలు అందించి పెట్టాడు. 2010లో తన చివరి టెస్టు ఆడాడు. కనేరియా స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడినట్టు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నిర్ధారించడంతో అతనిపై జీవితకాల నిషేధం విధించగా, ఎసెక్స్ జట్టులో కనేరియా సహచరుడు మెర్విన్ వెస్ట్‌ఫీల్డ్‌ను జైలుకు పంపింది.
ఆరేళ్ల నుంచి ఆబద్ధాలు చెబుతున్నాను.. ఇప్పుడు నిజం చెప్పడానికి ధైర్యం కావాలి. నాకెంతో భారంగా ఉంది. అందుకే ఇప్పుడు నిజం చెబుతున్నా.. స్పాట్ ఫిక్సర్ అని తాను ఇక పిలిపించుకోలేను.. ఇక ఎంత మాత్రమూ ఖండించనూ లేను… బుకీ అనుభట్‌ను కలిసి పెద్ద తప్పు చేశానని ఒప్పు కొన్నారు.
‘బుకీ అనుభట్‌తో కలిసి చాలా పెద్ద తప్పు చేశానని పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. అనుభట్‌కు దగ్గరవ్వడమే నేను చేసిన పెద్ద పొరపాటు, ఇలాంటి తప్పిదాలకు తావివ్వవద్దని యువ ఆటగాళ్లకు చెప్పడమే ఇకపై క్రికెట్‌కు నేను చేసే సేవ’ అని కనేరియా పేర్కొన్నాడు. 2010 ఇంగ్లండ్ పర్యటనలోనే సల్మాన్ భట్, మహ్మద్ ఆసిఫ్, మహ్మద్ ఆమిర్ స్ఫాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి ఐదేళ్ల నిషేధానికి గురయ్యారు.
