Wednesday, May 15, 2024
- Advertisement -

ఆ ‘గౌరవం’ సచిన్ కు ప్రశాంతత లేకుండా చేస్తోంది!

- Advertisement -

క్రికెటర్ గా దశాబ్దాల కెరీర్ ను కొనసాగించి.. భారతీయుల మన్ననలు అందుకొని సగౌరవంగా అంతర్జాతీయ కెరీర్ కు వీడ్కోలు పలికిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ను చూసి జాతి మొత్తం గౌరవిస్తుంది, అభిమానిస్తుంది. మరి ఆటగాడిగా ఆయనకు అలాంటి గౌరవమర్యాదలు అందుతున్నా..

ఒక విషయంలో మాత్రం సచిన్ కు ప్రశాంతత లేకుండా పోయింది.

ఈ విషయంలో టెండూల్కర్ పై విమర్శలు వస్తున్నాయి. ఆయనపై అభిమానం మాట అటుంచి.. సచిన్ ను విమర్శించే వాళ్లే ఎక్కువమంది కనిపిస్తున్నారు.

టెండూల్కర్ కు భారత ప్రభుత్వం “భారతరత్న” అవార్డును ప్రకటించినప్పుడే వివాదం మొదలైంది. ఆయనకు ఆ అవార్డును ప్రకటించడం పట్ల అనేక మంది అభ్యంతరం తెలిపారు. ఇలాంటి వారిలో రాజకీయ రంగ ప్రముఖులుకూడా ఉన్నారు. టెండూల్కర్ ను భారతరత్నగా ప్రకటించడం పట్ల అభిమానులు ఆనందభరితులు అయ్యారు కానీ.. అభ్యంతరాలు చెప్పే వారు కూడా గట్టిగానే వాదించారు. ప్రధానంగా టెండూల్కర్ ఎండార్స్ మెంట్ లలో కనిపించడం, ఐపీఎల్ లో ఆడటం.. వంటి కారణాలను చూపుతూ ఆయనకు భారతరత్న అవార్డు సరికాదనే అభిప్రాయాలను వినిపించాయి.

తాజాగా మరోసారి అదే జరిగింది. టెండూల్కర్ కు ప్రదానం చేసిన భారతరత్న పురస్కారాన్ని వెనక్కు తీసుకోవాలని అంటూ మధ్య ప్రదేశ్ లో కొంతమంది కోర్టుకు ఎక్కారు. టీవీ ఎండార్స్ మెంట్ లో కనిపిస్తూ డబ్బు పోగేసుకొంటున్న టెండూల్కర్ భారతరత్న ఎలా అవుతారు? అనేది పిటిషనర్ల ప్రశ్న. మరి వారి మాటల్లోనూ లాజిక్ ఉంది. మరి కోర్టు ఈ అంశం గురించి ఎలా స్పందించినా.. ప్రశాంతంగాఉండాల్సిన టెండూల్కర్ కు ఇవి అనవసరమైన తలనొప్పులు అని చెప్పవచ్చు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -