Wednesday, May 15, 2024
- Advertisement -

ఐపీఎల్ సీజన్-11లో తొలి విజయం నమోదు చేసిన కోహ్లీ సేన

- Advertisement -

ఐపీఎల్ సీజన్-11లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) హోం గ్రౌండ్ లో విజయం సాధించడం ద్వారా పాయింట్ల ఖాతా తెరిచింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుపై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. బెంగళూరు బౌలర్ల ధాటికి 19.2 ఓవర్లలో కేఎల్ రాహుల్ (47), కరుణ్ నాయర్ (29), అశ్విన్ (33) ఆకట్టుకోవడంతో 155 పరుగులు చేసిన పంజాబ్ ఆలౌట్ అయింది.

156 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన బెంగళూరుకు పేలవ ఆరంభం లభించింది. ఓపెనర్ మెక్‌కల్లమ్ ఇన్నింగ్స్ తొలి బంతికే ఔటవగా.. బౌండరీలు బాది టచ్‌లో కనిపించి కోహ్లిని ముజీబ్ అద్భుత బంతితో పెవిలియన్ చేర్చాడు. ఈ దశలో డికాక్, డివిలియర్స్ జోడి బెంగళూరును ఆదుకుంది. వీరిద్దరూ మూడో వికెట్‌కు 54 పరుగులు జోడించడంతో రాయల్ ఛాలెంజర్స్ కోలుకుంది. కానీ అశ్విన్ వరుస బంతుల్లో డికాక్, సర్ఫరాజ్‌లను ఔట్ చేసి బెంగళూరును దెబ్బతీశాడు.

డివిలియర్స్ నిలకడతో సునాయాసంగా విజయం సాధించింది. కీలక దశలో పంజాబ్ బౌలర్లు కోహ్లీ (21), డికాక్ (45), డివిలియర్స్ (57), మన్ దీప్ సింగ్ (22)లను అవుట్ చేయడంతో ఉత్కంఠ నెలకొంది. చివర్లో వాషింగ్టన్ సుందర్ రెండు ఫోర్లు కొట్టి జట్టును గెలిపించాడు. విజయానికి మరో 10 పరుగుల దూరంలో ఏబీ అవుటవగా.. కాసేపటికే మన్‌దీప్ సింగ్ (22) రనౌటయ్యాడు. కానీ వాషింగ్టన్ సుందర్ రెండు బౌండరీలు బాది తతంగాన్ని పూర్తి చేశాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -