Thursday, April 25, 2024
- Advertisement -

షాకింగ్ : అంత‌ర్జాతీయ క్రికెట్‌నుంచి రిటైర్‌మెంట్ ప్ర‌క‌టిచింన డివిలియర్స్..

- Advertisement -

దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్‌ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకి రిటైర్మెంట్‌ ప్రకటించాడు. 14 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌లో అసాధారణ రికార్డుల్ని తన పాదాక్రాంతం చేసుకున్న ఏబీ డివిలియర్స్.. 2019లో దక్షిణాఫ్రికా జట్టుకి ప్రపంచకప్‌ను అందించడమే తన స్వప్నమని ఇటీవల చెప్పాడు. అయితే అనూహ్యంగా రిటైర్‌మెంట్ నిర్ణ‌యం తీసుకున్నారు.

మీడియాతో మాట్లాడుతూ ‘రిటైర్మెంట్‌కి ఇదే తగిన సమయం. అందుకే.. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నా’ అని ప్రకటించేశాడు. సుదీర్ఘ కెరీర్‌లో 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20 మ్యాచ్‌లాడిన డివిలియర్స్.. దక్షిణాఫ్రికా జట్టుకి కెప్టెన్‌గా కూడా పనిచేశాడు. ‘ఇది చాలా కఠినమైన నిర్ణయం. ఇటీవల భారత్, ఆస్ట్రేలియా‌‌తో జరిగిన సిరీస్‌ల్లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. అందుకే.. రిటైర్మెంట్‌కి ఇదే తగిన సమయం అని నేను భావిస్తున్నా. ఇప్పటివరకు నాకు మద్దతుగా నిలిచిన అభిమానులకి థ్యాంక్స్’ అని డివిలియర్స్ వెల్లడించాడు.

ప్రస్తుతం ఏబీ డివిలియర్స్‌ ఐపీఎల్ 11వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతోన్న విషయం తెలిసిందే. ప్రపంచ క్రికెట్‌లో ఏబీ డివిలియర్స్‌ బ్యాట్స్‌మన్‌గానే కాక కీపర్‌గా, ఫీల్డర్‌గా కూడా అద్భుతంగా రాణించాడు. ఈ రోజు తాను ఓ కీలక నిర్ణయం తీసుకున్నానని తన ట్విట్టర్‌ ఖాతాలో డివిలియర్స్‌ ఇందుకు సంబంధించి ఓ వీడియో పోస్ట్ చేశాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -