Saturday, May 4, 2024
- Advertisement -

మాకు ద్ర‌విడ్‌లాంటి కోచ్ లేరు….పాక్ అభిమాన‌ల ఆవేద‌న‌

- Advertisement -

అండర్ 19 వరల్డ్‌ కప్ సెమీఫైనల్లో పాకిస్థాన్‌ ను ఇండియా చిత్తుగా ఓడించిన ఘ‌న‌విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. అన్నివిభాగాల్లో విఫలమైన పాకిస్ధాన్ పై అభిమానులు మండిపడుతున్నారు. దీంతో ప్లేయర్స్ ఆటతీరు, కోచ్ పై మండిపడుతున్నారు. భారత్ కు శుభాకాంక్షలు చెబుతూ, ద్రవిడ్ లాంటి లెజెండ్ కోచ్ గా ఉంటే ఇలాంటి విజయాలు సాధారణమని అంటున్నారు.

పాక్‌ యువ క్రికెటర్ల బేలతనంపై నిరుత్సాహం వ్యక్తం చేస్తున్న దాయాది జట్టు అభిమానులు రాహుల్‌ ద్రవిడ్‌ లాంటి కోచ్‌ తమ జట్టుకు ఉండి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని, తమ జట్టుకు ప్రముఖ ఆటగాడు మార్గదర్శకత్వం లేనందువల్లే ఇంతటి పరాజయం ఎదురైందని సోషల్‌ మీడియాలో అభిప్రాయపడుతున్నారు.

యువ వరల్డ్‌ కప్‌లో అసాధారణంగా రాణిస్తున్న శుభం గిల్‌ సెమీఫైనల్‌లోనూ చెలరేగి సెంచరీ సాధించడంతో మొదట బ్యాటింగ్‌ చేసిన కుర్రాళ్ల జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 272 పరుగులు చేసింది. అనంతరం ఇషాన్‌ పోరెల్‌ బంతితో నిప్పులు చెరిగి నాలుగు వికెట్లు తీయడంతో దాయాది జట్టు 69 పరుగులకు చాపచుట్టేసింది.

తాజా అండర్‌-19 వరల్డ్‌ కప్‌లో యువ జట్టు సాధిస్తున్న అద్భుతమైన విజయాల వెనుక రాహుల్‌ ద్రవిడ్‌ మార్గదర్శకత్వ పటిమ ఉంది. కోచ్‌గా జట్టును వెనకుండి నడిపిస్తున్న ద్రవిడ్‌.. తన అనుభవాన్నంతా రంగరించి.. యువ జట్టులో స్ఫూర్తినింపుతున్నారు. వరల్డ్‌ కప్‌ క్వార్టర్‌ ఫైనల్‌లో, సెమీఫైనల్‌లో యువ ఇండియా జట్టు చూపిన ప్రదర్శనే ఇందుకు నిదర్శనం

పాక్ కు మాత్రం అలాంటి వ్యక్తి కోచ్ గా లేడని, పాక్ కోచ్ మన్సూర్ రానా ఆడింది కేవలం రెండు వన్డేలు, చేసింది 15 పరుగులేనని, కనీసం ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఆడని వ్యక్తిని కోచ్‌ గా ఎందుకు పెట్టుకున్నారోనని విమర్శిస్తున్నారు. ఇదే సమయంలో భారత క్రికెట్ భవిష్యత్ సరైన వ్యక్తి చేతుల్లోనే ఉందని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -