Wednesday, May 15, 2024
- Advertisement -

తాగుడుకు బానిసై కోహ్లీ.. సచిన్ వల్ల ఈ స్థాయిలో ఉన్నాడు.. యువరాజ్ సలహానే ఇది..!

- Advertisement -

ప్రస్తుతం భారత్ జట్టులో విరాట్ కోహ్లీకి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. గతంలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ గా ఉన్న దిలీప్ వెంగసర్కార్ 2008 లో శ్రీలంక తో జరిగిన వన్డే సిరీస్ కు విరాట్ కోహ్లీ ని తొలిసారిగా ఎంపిక చేశారు. ఆ ఏడాదే కోహ్లీ నాయత్వంలో భారత్ అండర్ -19 జట్టు మలేషియా లో జరిగిన అండర్ – 19 ప్రపంచ కప్ ను సాధించింది. ఇక్కడే అసలు స్టోరీ స్టార్ట్ అయింది. సెలక్షన్ ఫైనల్ లో ఉన్న కొంత మంది విరాట్ కోహ్లీ కంటే తమిళనాడు ఆటగాడు బద్రీనాథ్ ను ఎంపిక చేయాలని పట్టు బట్టారు. కానీ వెంగసర్కార్ వారి మాట లెక్క చేయకుండా కోహ్లిని ఎంపిక చేశారు.

దీంతో వెంగసర్కార్ తన చైర్మన్ పదవిని కోల్పోయాడు. అయితే అప్పటి కంట్రోలర్ గా ఉన్న శ్రీనివాసన్ కోహ్లీని ఎంపికను చేయడంపై తప్పు పడుతూ.. బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న శరద్ పవార్ కు తెకిపాడు. ఈ విధంగా కోహ్లీ భారత్ జట్టులో స్థానం సంపాధించాడు. కానీ కోహ్లీ మొదట్లో సీనియర్ ఆటగాళ్లతో సమానంగా ఆడలేకపోయాడు. కోహ్లీ భారత్ జట్టులో స్థానం సంపాదించాక తన మొదటి పది వన్డే ల్లో కేవలం రెండు అర్ధ సెంచరీలు చేసాడు. దీనితో సెలక్టర్ల దృష్టిలో పడలేకపోయాడు. అంతే కాకుండా కోహ్లీ తన మితి మీరిన ప్రవర్తన వల్ల జట్టులో స్థానం కోల్పోయాడు. దక్షిణాఫ్రికా లో జరిగిన ఐపీఎల్ 2 వ ఎడిషన్ లో తాగుడుకు బానిసై విమర్శల పాలయ్యాడు. ఒక రకంగా చెప్పాలంటే 2009 సంవత్సరం కోహ్లీ కి ఒక గడ్డు కాలం అని చెప్పాలి. అందరి దృష్టిలో చెడు అభిప్రాయాన్ని కలిగిన కోహ్లీ మానసికంగా కృంగిపోయాడు. ఇలా కెరీర్ ను ప్రమాదంలో పడేసుకున్న కోహ్లీకి మన టీమిండియా సీనియర్ ఆటగాడైన యువరాజ్ సింగ్ అమూల్యమైన సలహాలు అందించి తిరిగి కోహ్లీ కెరీర్ ను గాడిలో పడేలా సహాయపడ్డాడు.

కోహ్లీ తనకు యువరాజ్ చెప్పిన మాటలు ద్వారానే నేను మళ్లీ నా ఆటను మెరుగుపరుచుకున్నానని, ఇంకెప్పుడూ చెడు వ్యసనాలకు బానిస కానని ధీమా వ్యక్తంచేశాడు. ఆ టైంలో కోహ్లీతో యువరజ్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపాడు. “నువ్వు మంచి నైపుణ్యం ఉన్న ఆటగాడిగా తయారు కావాలంటే సచిన్ టెండూల్కర్ చూసి నేర్చుకోవాలి. అతనిలా క్రమశిక్షణగా ఉండాలి, నిర్లక్ష్యంగా ఉండకుడదు. నన్ను అనుకరించడం పక్కన పెట్టి సచిన్ చూసి నేర్చుకో.. అతని దగ్గర సూచనలు తీసుకో”అని విరాట్ కోహ్లీ కి యూవరజ్ తెలిపాడు. ఆ తర్వాత కోహ్లీ అనతి కాలం టీం ఇండియాలో మంచి స్థానం సంపాధించుకున్నాడు. ఒకప్పుడు జట్టులో స్థానం కోసం వేచి చూసిన విరాట్ కోహ్లీ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రపంచ వ్యాప్తంగా తన ఆటతో ఎంతో మంచి అభిమానులను సొంతం చేసుకున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -