ఇంగ్లండ్‌తో జరిగిక కీలక మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోవడంతో జట్టుపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా ధోని, కేదార్‌పైనె విమర్శులు వస్తున్నాయి. ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో జరిగే తమ ఎనిమిదో మ్యాచ్‌లో టీమిండియా తుదిజట్టులో పలు మార్పులు చేసే అవకాశముంది. ముఖ్యంగా కేదార్ జాధవ్‌ను తుదిజట్టు నుంచి తప్పించే అవకాశం కనిపిస్తోంది. టీమిండియా మంగళవారం బంగ్లాదేశ్‌తో కీలక మ్యాచ్ ఆడుతున్న సంగతి తెలిసిందే.
ప్రపంచకప్‌లో కేదార్ జాధవ్‌కు వరుసగా అవకాశాలు లభిస్తున్నాయి. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేదార్ చెత్త బ్యాటింగ్‌తో అభిమానుల ఆగ్రహాన్ని చవిచూస్తున్నాడు. గెలుపు కోసం 31 బంతుల్లో 71 పరుగులు చేయాల్సిన తరుణంలో ఇటు కేదార్ జాధవ్ కానీ, అటు సీనియర్ బ్యాట్స్‌మన్ మహేంద్రసింగ్ ధోనీ కానీ.. ఆ కసిని, తపనను చూపించలేదు. భారీ లక్ష్యం ఎదురుగా ఉన్నా… ఈ జోడీ తమకు ఉన్న 31 బంతుల్లో 20 సింగిళ్లు తీసింది.
ఉత్కంఠభరిత క్షణాల్లో వీరోచితంగా ఆడాల్సిన సమయంలో నింపాదిగా టెస్ట్ మ్యాచ్ ఆడినట్టు ధోనీ-జాధవ్ బ్యాటింగ్ చేశారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేదార్ జాధవ్‌పై వేటు పడటం ఖాయమేనని వినిపిస్తోంది. అతన్ని తుది జట్టు నుంచి తప్పించి.. ఆ స్థానంలో రవీంద్ర జడ్డేజాను జట్టులోకి తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
