Monday, May 20, 2024
- Advertisement -

రాజీనామా చేస్తా – కెసిఆర్

- Advertisement -

మహారాష్ట్ర తో కీలక ఒప్పందాలు చేసుకుని తిరిగి వచ్చిన కెసిఆర్ కి ఘన స్వాగతం లభించిన సంగతి తెలిసిందే. గొప్ప ఊరేగింపుతో పాటుగా కెసిఆర్ హైదరాబాద్ చేరుకున్నారు. ఈ ఒప్పందం విషయం ఆయనకీ నెగెటివ్ కామెంట్ లు కూడా ఎక్కువ అయిపోయాయి . మ‌హారాష్ట్రలో కుదిరిన ఒప్పందం విష‌యంలో కూడా కాంగ్రెస్ నేత‌లు ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి, జానారెడ్డి విమ‌ర్శ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

ఈ ఒప్పందం తెలంగాణ ప్ర‌జ‌ల‌పాలిట శాపంగా మారుతుంది, రాష్ట్ర ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల‌ను మ‌హారాష్ట్రకు తాక‌ట్టు పెట్టేశార‌నీ, త‌మ్మిడి హెట్టి ప్రాజెక్టు గ‌తంలో 152 అడుగుల‌కు ఓకే అయిదే, దాన్ని త‌గ్గించుకుని వ‌చ్చి సంబ‌రాలు చేసుకోవ‌డం ఏంట‌ని విమ‌ర్శించారు. ఈ ఆరోప‌ణ‌ల‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ మండిప‌డ్డారు.

ఆదిలాబాద్ జిల్లాలోని త‌మ్మిడి హెట్టి ప్రాజెక్టు ఎత్తు 152 అడుగులుగా గ‌తంలో ఒప్పందం కుదిరింద‌ని నిరూపిస్తే నేరుగా రాజ‌భ‌వ‌న్‌కు వెళ్లి ముఖ్య‌మంత్రివికి రాజీనామా చేయ‌డానికి సిద్ధంగా ఉన్నాన‌నీ, ఆ ఆధారాల‌ను చూపించే ద‌మ్ము మీకుందా, ఉంటే వాటిని తీసుకుని బేగంపేట‌కు రండి… అంటూ కాంగ్రెస్ నేత‌ల‌కు ముఖ్య‌మంత్రి స‌వాలు విసిరారు. ఆ ఒప్పంద ప‌త్రాలు ప‌ట్టుకుని వ‌స్తే.. తాను వెంట‌నే రాజ్‌భ‌వ‌న్‌కు వెళ్తాన‌నీ, రాజ‌నామా గ‌వ‌ర్న‌ర్‌కు స‌మ‌ర్పిస్తాన‌ని ఛాలెంజ్ చేశారు. తెలంగాణ‌లో జ‌రుగుతున్న అభివృద్ధిని ఎవ్వ‌రూ ఆప‌లేర‌న్నారు. కాంగ్రెస్‌, టీడీపీ, భాజ‌పా నేత‌లు అడ్డుప‌డ్డా అభివృద్ధి ప‌నులు ఆగే ప్ర‌స‌క్తే లేద‌ని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -