- Advertisement -

విశాఖలో భారీ ప్రమాదం.. లీకైన కెమికల్ వాయువు.. 8మంది మృతి..!

- Advertisement -

విశాఖపట్టణంలో ఈ తెల్లవారుజామున భారీ ప్రమాదం జరిగింది. వెంకటాపురంలో గోపాలపట్నం పరిధిలోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి భారీగా కెమికల్ గ్యాస్ లీకై దాదాపు మూడు కిలోమీటర్ల మేర వ్యాపించింది. 200 మంది వరకు అస్వస్థతకు గురికాగా ఎనిమిది మంది ప్రాణాలు విడిచారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని డాక్టర్లు అంటున్నారు.

బాధితుల్లో ఎక్కువమంది మహిళలు చిన్నారులు వృద్ధులు ఉన్నారు. ఇక ఈ ప్రమాదం ఎలా జరిగిందంటే.. పరిశ్రమ నుంచి లీక్ అయిన రసాయన వాయువు 3 కి.మీల మేర వ్యాపించింది. దాంతో చర్మంపై దద్దుర్లు కళ్లలో మంటలు శ్వాస తీసుకోవడం ఇబ్బందులతో స్థానికులు అస్వస్థతకు గురయ్యారు. లీక్ అయ్యి గ్యాస్ ని పీల్చి చాలా మంది అపస్మారిక స్థితిలో రహదారిపై పడిపోయారు. వీరిని అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. పరిశ్రమకు ఐదు కి.మీల పరిధిలో ఉన్న ప్రాంతాల ప్రజలను ఇళ్ల నుంచి ఇతర ప్రాంతాలకు పోలీసులు తరలిస్తున్నారు.

సింహాచలం నుంచి ఆర్టీసీ బస్సులను తీసుకొచ్చి పరిశ్రమకు 5 కి.మీల పరిధిలో ఉన్న వారిని తరలిస్తున్నారు. ఈ ప్రమాదంపై ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్, పోలీస్ కమిషనర్‌ ఆర్‌కే మీనాతో ఫోన్‌లో మాట్లాడిన ముఖ్యమంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. బాధిత ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు సరైన చికిత్స అందేలా చూడాలని ఆదేశించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -