- Advertisement -

ర్యాపిడో బైక్ నుంచే దూకేసిన యువ‌తి..

- Advertisement -

ఢిల్లీలో మరోసారి మహిళల భద్రత ప్రశ్నార్థకమైంది. ఆఫీసుకు వెళ్లేందుకు ర్యాపిడో బైక్ బుక్ చేసుకున్న ఓ యువతికి ఆ ప్రయాణం నరకప్రాయంగా మారింది. డ్రైవర్ కావాలనే నిర్జన ప్రదేశానికి మళ్లించడంతో భయపడిన బాధితురాలు కదులుతున్న బైక్ నుంచే దూకేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర దుమారం రేపుతోంది. కస్టమర్ సపోర్ట్ నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

బాధితురాలు ఆయేషా శ్రీవాస్తవ తన ఆఫీసుకు వెళ్లే నిమిత్తం ర్యాపిడో బైక్ బుక్ చేసుకోగా, ప్రయాణం కొద్దిసేపు సామాన్యంగానే సాగింది. కానీ కొద్దిసేపటి తర్వాత డ్రైవర్ తాను గుర్తించలేని, నిర్మానుష్యంగా ఉన్న మరో మార్గంలోకి బైక్‌ను మళ్లించాడు. చుట్టూ జనం లేకపోవడంతో అనుమానం వచ్చిన ఆయేషా ప్రశ్నించగా, యూనివర్సిటీకి వెళ్లే దారేనని డ్రైవర్ బదులిచ్చాడు. అయినప్పటికీ ఆమెకు నమ్మకం కలగక మార్గం మార్చాలని, బైక్ ఆపాలని కోరినా డ్రైవర్ పట్టించుకోలేదు.

పరిస్థితి చేయిదాటిపోతోందని భావించి ప్రాణభయంతో కదులుతున్న బైక్ నుంచే ఆమె కిందకు దూకేశారు. రోడ్డుపై పడటంతో చేతులు, కాళ్లు, తలకు తీవ్ర గాయాలై ఆమె ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఈ దారుణ ఘటన తర్వాత ర్యాపిడో కస్టమర్ సపోర్ట్‌ను సంప్రదించినా సకాలంలో ఎలాంటి స్పందన రాలేదని, అందుకే తాను సోషల్ మీడియాను ఆశ్రయించాల్సి వచ్చిందని ఆయేషా వాపోయారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -