మద్యం మత్తులో ఏం చేస్తారో తెలియదు. కొందరు అమ్మాయిలను ఏడిపిస్తారు. కొందరు రోడ్డు మీదే పడిపోతారు. మరి కొందరు విచిత్రమైన చెష్టలు చేస్తారు. అయితే తాజాగా మద్యం మత్తులో ఓ వ్యక్తి పామును చంపి మెడలో వేసుకుని హల్ చల్ చేశాడు. అతన్ని అటవీశాఖ అధికారులు అరెస్ట్ చేశారు.
వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసిన అధికారులు అతన్ని అరెస్ట్ చేశారు. ఈ ఘటన కర్ణాటకలోని ముగబాగిలు తాలూకా ముష్టూరు గ్రామంలో జరిగింది. కుమార్ అనే వ్యక్తి ఫుల్లుగా తాగి బైక్‌లో వెళ్తుండగా.. పాము కనిపించింది. తాగిన మైకంలో దాన్ని చేతుల్లోకి తీసుకున్న కుమార్.. పామును కొరికి చంపేశాడు. . ఆ తరువాత మెడలో వేసుకున్నాడు.
దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు.. కుమార్‌ను అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే దాదాపు 40 రోజుల లాక్‌డౌన్ తరువాత మద్యం షాపులు తెరుచుకోవడంతో.. లైన్ లో గంటల తరి నిలబడి మరి మద్యం కొనుగోలు చేస్తున్నారు. ఇలా మద్యం చాలా రోజుల తర్వాత దొరకడంతో ఫులుగా తాగి వింత చేష్టలు చేస్తున్నారు.
