- Advertisement -

సిద్దూ కాళ్లు మొక్కిన డీకే శివకుమార్!

- Advertisement -

ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ‘బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్’కు హాజరయ్యారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. రాష్ట్రంలో త్వరలోనే నాయకత్వ మార్పు (సీఎం మార్పు) ఖాయమనే సంకేతాల నడుమ ఈ సమావేశం ఉత్కంఠ రేపుతోంది. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్…ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పాదాలను తాకి నమస్కరిస్తూ ఆయన గౌరవపూర్వకంగా ఆశీస్సులు తీసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు నేతలు ఆలింగనం చేసుకోవడం.. రాష్ట్రంలో త్వరలోనే జరగబోయే అధికార మార్పిడికి స్పష్టమైన సంకేతంగా కనిపిస్తోంది.

మీటింగ్ తర్వాత సిద్ధరామయ్య తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా ప్రకటించారు. ఆయన స్థానంలో డీకే శివకుమార్ కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తోంది. అంతకుముందు, సీఎం మార్పు ఊహాగానాలు మరియు డీకే శివకుమార్ పదోన్నతి వార్తల నడుమ.. శివకుమార్ సిద్ధరామయ్య అధికారిక నివాసమైన ‘కావేరి’కి చేరుకున్నారు. భారీ భద్రత నడుమ జరిగిన ఈ సమావేశానికి ప్రియాంక్ ఖర్గే, కేజే జార్జ్, ఎంబీ పాటిల్, రామలింగారెడ్డి, హెచ్‌కే పాటిల్ వంటి పలువురు కర్ణాటక మంత్రులు కూడా హాజరయ్యారు.

కర్ణాటకలో నాయకత్వ మార్పుపై గత కొన్ని నెలలుగా అంతర్గతంగా తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. హైకమాండ్ ,రాష్ట్ర నేతలు ఈ నివేదికలను పదే పదే కొట్టిపారేసినప్పటికీ లోలోపల మాత్రం ఈ ప్రక్రియ సాగుతూనే వచ్చింది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సగం పదవీకాలం ముగిసినప్పటి నుండి డీకే శివకుమార్‌ను సీఎం పీఠంపై కూర్చోబెట్టాలనే డిమాండ్ గట్టిగా వినిపించింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో.. శివకుమార్ తదుపరి ముఖ్యమంత్రి కాబోతున్నారనే ఆనందంతో ఆయన మద్దతుదారులు స్వీట్లు పంచుకుని…బెంగళూరులోని మేఖ్రి సర్కిల్ వద్ద భారీ పోస్టర్లను కూడా ఏర్పాటు చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -