ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఎప్పుడు లేని పాలనా ఇప్పుడు ఎంతో సమర్ధవంతంగా, స్పష్టంగా జరుగుతుంది.. ప్రతిది ప్రజలకు తెలిసేలా జగన్ అన్ని అధికారుల ద్వార చెప్పించడం గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు.. దాంతో ప్రజలు జగన్ లో ఉన్న నిబద్ధత ను చూసి ఆశ్చర్య పోతున్నారు.. ఇలాంటి నాయకుడినా మనం ఇన్నాళ్ళు పక్కన పెట్టింది అని బాధపడుతున్నారు కూడా.. అయితే జగన్ ను గెలిపించింది ముఖ్యంగా నవరత్నాల కాన్సెప్ట్ అని చెప్పాలి.. అవి తూచా తప్పకుండా అమలుపరుస్తూ ప్రజల్లో మరింత నమ్మకాన్ని కూడగట్టుకుంటున్నారు..
ఇక అధికారులతో సమీక్షలు, ప్రజాప్రతినిధులతో సమావేశాలలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ పదే పదే చెప్పే మాట పరిపాలనా విధానంలో గత ప్రభుత్వాలకు, ఇప్పటికి మార్పు చూపాలని. నాడు – నేడు తేడాను ప్రజలు గుర్తించేలా చేయాలని. సంక్షేమ ఫలాలు అందించడంలోనే కాదు.. వాటి అమలు తీరును తెలుసుకునేందుకు తనపై తానే సవాలు విసురుకుంటున్నారు జగన్.విపక్షాలకు అవకాశం ఇవ్వకుండా పథకాల అమలులో లోపాలు తెలుసుకుని తప్పు సరిద్దుకోవాలని ఆయన కొన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు..
అయితే ఇప్పటివరకు ఒకరకమైన పరిపాలన చేశాం, ఇకపై స్టైల్ మార్చి ప్రజలకు మరింత దగ్గరవ్వాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించారట. ఇప్పటికే బుక్ లేట్ ల ద్వారా మేనిఫెస్త్లో ఏం చెప్పింది, ఈ ఏడాది లో ఏం చేసింది రాయించి వాటిని గ్రామా వాలంటీర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు పంపిస్తోంది. 78,54,563 బుక్లెట్లను వలంటీర్లు ఇంటింటా పంపిణీ చేశారు. అంతేకాదు ఇంకా ప్రజలకు ఉన్న లోటుపాట్లను తెలుసుకుని వాటిని సాల్వ్ చేసేవిధంగా కొత్త కొత్త కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నారట.. వాస్తవానికి 129 హామీల్లో ఇప్పటికే 90.80 శాతం అమలు చేసి 3.98 కోట్ల మందికి లబ్ధి కలిగించడం అంటే మాటలు కాదు. అందుకే తాను చేసిన పనులను జగన్ ప్రజలకు నిర్భయంగా చెప్పగలుగుతున్నారు.