Saturday, May 4, 2024
- Advertisement -

90 గంటలు నరకం.. మృత్యువును జయించిన చిన్నారి!

- Advertisement -

ఈ ఏడాది ప్రపంచంలోని ప్రజలు ఎంతగా నరకం అనుభవిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఓ వైపు భయంకరమైన కరోనా వైరస్ మరో వైపు ప్రకృతి విలయతాండవం. టర్కీ, గ్రీస్‌లలో ఐదు రోజుల క్రితం సంభవించిన భూకంపం ఎంతోమంది ప్రాణాలను హరించగా, మరెందరినో నిరాశ్రయులను చేసింది. ఇప్పటికే కరోనాతో నరకం అనుభవించిన ఇక్కడి ప్రజలకు భూకంపం రూపంలో మరో నరకాన్ని చూపించింది. తాజాగా  శిథిలాల తొలగింపులో తలమునకలుగా ఉన్న రెస్క్యూ సిబ్బందికి నిన్న ఆశ్చర్యపోయే ఘటన ఒకటి ఎదురైంది. 

టర్కీలోని ఇజ్మీర్‌లో ఓ అపార్ట్‌మెంట్ శిథిలాలను తొలగిస్తున్న క్రమంలో మూడేళ్ల చిన్నారి సజీవంగా కనిపించింది. దాదాపు 90 గంటల పాటు ఆ చిన్నారి శిథిలాల్లో నరకం అనుభవించింది. ఆ చిన్నారి పేరు ఐదా గెజ్‌గిన్. అయితే భూకంపం సమయంలో ఐదా తండ్రి, సోదరుడు భవనం లేరు. ఇక తమ చిన్నారి తల్లి మాత్రం చనిపోయింది. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆ చిన్నారి శిథిలాల కింద ఏడుస్తూ కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అయ్యారు.

తమ చిన్నారి ఇలా 90 గంటల పాటు నరకం అనుభవించడం హృదయాలను తొలచేసిందని అంటున్నారు. ఈ క్రమంలో డిష్ వాషర్ పక్కన బలహీనంగా ఉన్న చిన్నారి కనిపించింది. చిన్నారిని రక్షించిన సిబ్బంది క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఐదా ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

ఓరి నాయనో.. స్కూల్ తెరిచిన రోజే కరోనా షాక్!

ప్రచార ఆర్భాటాలు లేకుండా పోలవరం పనులు

మన హీరో,హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పేది వీళ్ళే..!

రహస్యంగా పెళ్ళి చేసుకున్న సెలబ్రిటీలు వీళ్లే..! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -