- Advertisement -

కరోనాను ఆరోగ్యశ్రీ లో చేర్చేది ఇంకెప్పుడు కేసీఆర్ సారు? : షర్మిల

- Advertisement -

తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ ఉవ్వెత్తున ఎగసిపడుతూ వచ్చారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ కూతురు వైఎస్ షర్మిల. ఇటీవల ఖమ్మంలో తన పార్టీ జండా, అజెండా త్వరలో తెలియజేస్తానంటూ చెప్పారు. తెలంగాణలో నిరుద్యోగ యువత ఎన్నో కష్టాలు పడుతున్నారని.. లక్ష ఉద్యోగాలు ఇస్తానన్న టీ సర్కార్ వారిని నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 72 గంటల పాటు నిరుద్యోగ యువత కోసం నిరాహార దీక్ష కూడా చేశారు. గత కొన్ని రోజులు గా తెలంగాణ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.

తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతున్న సమయంలో ఎంతో మంద నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారని.. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చేది ఆలోచిస్తాం అని చెప్పి ఎనిమిది నెలలు గడిచిపోయింది, కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చేది ఇంకెప్పుడు కేసీఆర్‌ సారు? చచ్చే వారు పేదలు కాదనా? లేక పేదలు చచ్చినా ఎవరు అడిగేవారు ఉండరనే ధైర్యమా? లేక .. మీ లెక్కకు సరిపడ మరణాలు నమోదు కాలేదనా?’ అని ష‌ర్మిల నిల‌దీశారు. దీనికి సంబంధించిన ఓ దిన‌ప‌త్రిక‌లో వ‌చ్చిన క‌థ‌నాన్ని పోస్ట్ చేసిన వైఎస్ ష‌ర్మిల తెలంగాణ స‌ర్కారుపై మండిప‌డ్డారు.

అయ్యా .. KCR సారు .. ఇప్పడికే జనం తిరగ పడుతున్నరు, కరోనా తో రోడ్ల మీద పడ్డమని, బతుకులు ఆగమైనయని, జనం ఇంకా బర్బాద్ కాకముందే కరోనా ను ఆరోగ్యశ్రీ లో చేర్చండి. ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి. లేదంటే .. కరోనా సునామీలో కల్వకుంట్ల సామ్రాజ్యం కొట్టుకుపోవుడు ఖాయమే అంటూ ట్విట్ చేశారు వైఎస్ షర్మిల.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -