- Advertisement -

కరోనా వ్యాప్తికి అడ్డుక‌ట్ట వేసే 2డీజీ ఔషథం విడుదల

- Advertisement -

భార‌త‌ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) అభివృద్ధి చేసిన 2-డియాక్సీ డి-గ్లూకోజ్ (2డీజీ) ఔషధం కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్, డాక్టర్ హర్షవర్థన్ సోమవారం ఉదయం విడుదల చేశారు. ఢిల్లీలోని పలు ఆసుపత్రుల్లో పది వేల డోసులను పంపిణీ చేస్తారు. ఈ ఔషథం పొడి రూపంలో ఉంటుందని, నీళ్లతో కలిసి తీసుకోవాలని మంత్రులు తెలిపారు. కరోనా నియంత్రణకు 2డిజి కూడా చాలా బాగా పని చేస్తుందని వారు తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హ‌ర్షవ‌ర్ధ‌న్‌తో పాటు ప‌లువురు అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ ఔషధాన్ని గతంలో కేన్సర్ కోసం తయారు చేశారు. మాన‌వ‌ శరీరంలో కేన్సర్ కణాలకు గ్లూకోజ్ అందకుండా ఈ మందు అడ్డుకుంటుంది. ఇదే సూత్రంతో క‌రోనా వైర‌స్ చికిత్స కోసం పరిశోధన ప్రారంభించి కొన్ని నెల‌లుగా కృషిచేశారు.

ఇది శరీరంలో కరోనా వ్యాప్తికి అడ్డుక‌ట్ట ప‌డుతుంద‌ని చెప్పారు.డిఆర్ డిఒ ఈ పొడిని డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరితో కలిసి అభివృద్ధి చేసిందని మంత్రులు వెల్లడించారు, 2డిజి ఔషథాన్ని కరోనా బాధితులకు అత్యవసర సమయంలో ఇచ్చేందుకు డిసిజిఐ ఇటీవల అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. కరోనాతో చికిత్స పొందుతున్న వారు శరవేగంగా కోలుకుంటున్న వారికి 2డిజి బాగా పని చేస్తుందని సైంటిస్టులు తెలిపారు.

సీరియల్ ‘హీరోయిన్’గా నటించి సినిమా అవకాశం దక్కించుకుంది.. ఎవరంటే?

ఎంపీ రఘురామకృష్ణరాజు పై అసలు కుట్ర ఎక్కడ జరుగుతుంది..?

బుల్లితెరపై టాప్ 5 యాంకర్స్ వీళ్ళే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -