Wednesday, May 8, 2024
- Advertisement -

ఎంపీ రఘురామకృష్ణరాజు పై అసలు కుట్ర ఎక్కడ జరుగుతుంది..?

- Advertisement -

గత రెండేళ్లగా ప్రభుత్వాన్ని, సీఎం జగన్ ను పదే పదే తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు చేస్తువస్తున్న వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ను హైదరాబాదులోని తన నివాసంలో కొన్ని నాటకీయ పరిణామాల మధ్య 124 ఐపీసీ-ఎ సెక్షన్ కింద ఏపీ సీఐడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు గుంటూరులోని సీబీసీఐడీ ప్రత్యేక కోర్టులో రఘురామకృష్ణరాజు హాజరుపరిచారు.

పోలీసులు తన కాళ్లు వాచిపోయేలా కొట్టారని.. రాత్రంతా వేధింపులకు గురిచేశారని సంచలన ఆరోపణలు చేశారు. మరోపక్క హైకోర్టులో బెయిల్ పిటిషన్.. బెయిల్ రద్దు. ఇంతలో రఘురామ కృష్ణంరాజు ఒంటిపై గాయాలు ఉన్న పోటోలను తన తరపు లాయర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాదు జైలులో ప్రాణ హాని ఉందని ఆయన తరపున న్యాయవాది వాదించారు.

తరువాత కోర్టు అవి నిజంగా పోలీసులు కొట్టినవా లేక ఇతర గాయాలా అనేది ముగ్గురితో మెడికల్ బోర్డు ఏర్పాటు చేసిన సీఐడీ కోర్టు. 18 రకాల వైద్య పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. అయితే రఘురామకృష్ణంరాజు చూపించిన అరికాలు గాయాలు.. గాయాలు కావని జీజీహెచ్‌ వైద్యులు హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో స్పష్టంచేశారు. అతని రెండుకాళ్లకి ఎడీమా ఉందని.. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల లేదా నిలబడ్డం వల్ల రెండు కాళ్లపాదాల రంగు మారి ఉండొచ్చని పేర్కొన్నారు.. రఘురామకృష్ణరాజు శరీరంపైన ఎలాంటి గాయాలూ లేవని.. ఆయన పాదాల రంగు మారడానికి కారణం ఎవరో కొట్టడం వల్లకాదని స్పస్టంచేసింది.

ఇది ఇలా ఉండగానే రఘురామకృష్ణరాజు సతీమణి రమాదేవి సంచలన ఆరోపణలు చేశారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ పోలీసులు తన భర్తను బాగా కొట్టారని ఆరోపించారు. కోర్టు నిబంధనలను పట్టించుకోకుండా జైలుకు తిప్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భర్తను జైల్లో చంపడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. ఇప్పటికే కడపకు చెందిన వ్యక్తులను జైలుకు పక్కా ప్రణాళికతో ముందుగానే తరలించారని వివరించారు.

రఘురామకృష్ణరాజుకు జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించి తన ఆరోగ్యం అన్ని విధాలా బాగుంది అంటున్న ఎందుకు రమేశ్ ఆసుపత్రిలో చెర్చలన్నంటున్నారు. ఇక్కడే సోషమీడియా లో ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. ఇంకా విచారణ కొనసాగితే అసలు రఘురామకృష్ణరాజును ఎవరు ప్రోచ్చహిస్తున్నారు.. ఎవరి ప్రలోభాలకు లొంగి రఘురామకృష్ణరాజు ఇలా వ్యవహరించారు అన్న విశయాలు బయటకి వస్తాయని.. రమేశ్ ఆసుపత్రిలో రఘురామకృష్ణరాజు పై ఎమన్న కుట్రలు జరుగుతున్నాయ అనే అనుమానాలకు మరింత బలం చెకూర్చినట్లుంది అంటున్నారు నెటిజన్లు. అంతే కాదు రఘురామకృష్ణరాజు సతీమణి రమాదేవి కి అసలు కుట్ర అక్కడే జరుగుతుంది తెలుసుకోండి అంటు సలహాలు కూడా ఇస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -