- Advertisement -

బ్రేకింగ్..సీఐడీ కస్టడీకి చంద్రబాబు

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబుకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే చంద్రబాబు బెయిల్ పిటిషన్లు వాయిదా వేస్తు వస్తున్న న్యాయస్ధానం తాజాగా క్వాష్ పిటిషన్‌ని డిస్మిస్ చేసింది. ఇక స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని సీఐడీ వేసిన పిటిషన్‌పై తీర్పు వెలువరించింది. చంద్రబాబును 2 రోజుల కస్టడీకి ఇస్తూ తీర్పు వెలువరించింది. దీంతో చంద్రబాబుకు గట్టి షాక్ తగిలింది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో సీఐడీ తరపు న్యాయవాదుల వాదనతో ఏకీభవించింది.

స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్‌లో సెప్టెంబర్ 10న ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది ఇక ఈ రిమాండ్ నేటితో ముగియనుండగా వర్చువల్‌గా జడ్జి ఎదుట చంద్రబాబును ప్రవేశపెట్టారు పోలీసులు. ఆన్‌లైన్‌లోనే విచారణ జరుగగా రిమాండ్‌ని రెండు రోజుల పాటు పొడగించారు న్యాయమూర్తి.

రాజకీయ కక్షలో భాగంగానే తనని అరెస్టు చేశారని…. చేయని తప్పును చేశానని చెప్తున్నారు. నా అరెస్టు అన్యాయంగా జరిగిందని జడ్జి ముందు తన వాదన వినిపించారు చంద్రబాబు. 46 ఏళ్ల రాజకీయ జీవితలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు చూడలేదు. నా హక్కులను రక్షించాలన్నారు. అయితే మీ పై కేవలం ఆరోపణలు మాత్రమే వచ్చాయి…రిమాండ్‌ని శిక్షగా భావించొద్దు అన్నారు న్యాయమూర్తి. చట్టం ప్రకారం అంతా సమానమేనని తెలిపారు. ఇక క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేయడంతో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు టీడీపీ నేతలు.

ఇక స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంతో పాటు ఫైబర్ నెట్ స్కాం,అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వంటి స్కాంలలో చంద్రబాబే ప్రధాన కుట్రదారని సీఐడీ అధికారులు ఛార్జీషీట్‌లో పేర్కొన్నారు. ఫైబర్ నెట్ స్కాంలో ఏ1గా చంద్రబాబును చేర్చగా ఆయన్ని ఈ కేసులో కూడా 5 రోజుల కస్టడీకి అనుమతించాలని ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసింది సీఐడీ. స్కిల్ స్కామ్ ,ఫైబర్ స్కామ్ ఇలా కేసుల్లో బాబు ప్రమేయం ఉందని తేలితే ఆయన రాజకీయ జీవితం క్లోజ్ అయినట్లేనని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -