- Advertisement -

అసెంబ్లీ సమావేశాల బాయ్‌కాట్..టీడీపీ మళ్లీ తప్పుచేసిందా?

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఆ పార్టీ నేతలకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. చంద్రబాబు అరెస్ట్ పై జాతీయ పార్టీల మద్దతు కూడగట్టడం, బీజేపీ పెద్దలను కలవడం, ప్రజల్లో సానుభూతి రగల్చడం వంటి అనేక కార్యక్రమాలు తీసుకున్న అవి అంతగా ఫలితాన్ని ఇవ్వలేదు. ఇక పార్లమెంట్ వేదికగా చంద్రబాబు అరెస్ట్‌ని ప్రస్తావించిన అన్ని పార్టీలు, ముఖ్యంగా బీజేపీ సైతం లైట్‌గానే తీసుకుంది. ఇక తాజాగా ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో తమ గళం వినిపిస్తారనుకున్నా ఆ దిశగా ప్రయత్నం చేయకపోగా తాజాగా అసెంబ్లీ, శాసనమండలిని బహిస్కరిస్తున్నట్లు ప్రకటించారు టీడీపీ నేతలు. దీంతో టీడీపీ నేతలు రాంగ్ స్టెప్ వేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఎందుకంటే చంద్రబాబు అరెస్ట్‌పై సిద్ధమని మంత్రులు ప్రకటించారు. ప్రాపర్ ఫార్మాట్‌తో రావాలని సూచించారు. కానీ టీడీపీ నేతలు చంద్రబాబు అరెస్ట్ పై వైఎస్ జగన్ క్షమాపణ చెప్పాకే చర్చకు వస్తామని పట్టుబట్టారు. ఇక చివరకు అసెంబ్లీ నుండి బయటకు వచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ప్రభుత్వం మాత్రం టీడీపీ సభ్యులు లేకున్నా అసెంబ్లీలో చర్చ జరిపింది. అసెంబ్లీ వేదికగా వైసీపీ ఎమ్మెల్యేలు స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అవినీతి ఎలా జరిగిందో వివరించారు. టీడీపీ ఎమ్మెల్యేలకు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం గురించి తెలుసుకాబట్టే వారు చర్చనుండి పారిపోయారని ఆరోపించారు.

టీడీపీ నేతలకు దమ్ముంటే చంద్రబాబు అవినీతిపై ఈడీ విచారణ కోరాలని డిమాండ్ చేశారు. చర్చ నుండి టీడీపీ పారిపోవడంతో వైసీపీ నేతలు అసెంబ్లీని చక్కని వేదికగా ఉపయోగించుకుని టీడీపీని ప్రజల ముందు ముద్దాయిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. మొత్తంగా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించి టీడీపీ నేతలు సెల్ఫ్ గోల్ చేసుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -