ఏపీ సీఎం జగన్‌కు ఇది నిజంగా గుడ్ న్యూస్. విశాఖపట్నం నుండి పాలన సాగించేందుకు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రుషికొండపైన పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టారు. దీంతో ఇది రాజకీయంగా దుమారం చెలరేగగా దీనిపై లింగమనేని శివరామ ప్రసాద్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
ఇవాళ దీనిని విచారించిన సుప్రీం…ఈ పిటిషన్‌ని డిస్మిస్ చేసింది. సుప్రీం రాజకీయాలకు వేదిక కాదని.. ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని సీజేఐ డివై.చంద్రచూడ్ స్పష్టం చేశారు. ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే హైకోర్టుకు వెళ్లాలని న్యాయస్థానం సూచించింది. రుషికొండ పై నిర్మాణాలు చేయోద్దన్న పిటీషన్ ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది.
మరోవైపు డిసెంబర్ నుంచి విశాఖ కేంద్రంగా పాలన ప్రారంభించేందుకు సీఎం జగన్ సిద్దం అవుతున్నారు. మంత్రులు తమ కార్యాలయాల ఏర్పాటులో నిమగ్నం కాగా చకచక ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఇక టీడీపీ చేస్తున్న ఆరోపణలపై వైసీపీ సైతం ఘాటుగానే స్పందిస్తోంది. ప్రభుత్వ స్థలాన్ని ప్రభుత్వం ఆక్రమించటం ఏంటని కౌంటర్ చేస్తున్నారు. అయితే రిషికొండ నిర్మాణాల విషయంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ , హైకోర్టులలో కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఏదిఏమైనా సుప్రీంలో జగన్ సర్కార్‌కు రిలీఫ్ లభించడంతో వైసీపీ శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
