టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ తర్వాత ఆయన అనుకూల ఎల్లో మీడియాలో విషపు రాతలతో రోత పుట్టించిన సంగతి తెలిసిందే. ఇక ఎల్లో సోషల్ మీడియాలో అయితే చెప్పనక్కర్లేదు. ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో సీఎం జగన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తూ కమ్మ పైత్యాన్ని ప్రదర్శించారు కొంతమంది. ఇక మరికొంతమందైతే ఏకంగా న్యాయవ్యవస్థనే టార్గెట్ చేస్తూ వికృత పోస్టులు పెట్టారు. ఇక అలాంటి వారు జాగ్రత్తగా ఉండాల్సిందే. లేకపోతే వారి ఆస్తులు అటాచ్ చేస్తామని హెచ్చరిస్తోంది ఏపీ సీఐడీ.
సీఎం జగన్, ఆయన కుటుంబ సభ్యులపై అసభ్య పోస్టులు పెట్టే వారి ఆస్తులను అటాచ్ చేస్తామని ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ స్పష్టం చేశారు. ఇప్పటికే కొన్ని సోషల్ మీడియా అకౌంట్లను గుర్తించి వాటిని తొలగించామని తెలిపారు. అలాగే న్యాయవ్యవస్థను కించ పరిచే వారిని వదిలిపెట్టమని తేల్చి చెప్పారు. విదేశాల్లో ఉంటూ తప్పుడు పోస్ట్ చేసే వారిపై ఆయా దేశాల ఎంబసీని సంప్రదించి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఇప్పటికే 45 కేసుల్లో ఐదుగురిపై ఎల్‌వోసీ ప్రోసీడింగ్స్ చేపట్టామన్నారు. జగన్ కుటుంబ సభ్యులపై పోస్టులు పెడుతున్న టీడీపీ నేతలు టీడీపీ కార్తీక్ రెడ్డి, సమర సింహా రెడ్డి, చిత్రలహరి, వైసీపీ మొగుడు అనే అకౌంట్స్ గుర్తించి నలుగురిపై చర్యలు తీసుకున్నాం అన్నారు. కొన్ని అనుమాని సోషల్ మీడియా అకౌంట్లను మానిటరింగ్ చేస్తున్నామని తెలిపారు. పొలిటికల్ పార్టీలపై ఉన్న ప్రేమతో అసభ్యకర పోస్టులు పెట్టి యువత తమ భవిష్యత్‌ని నాశనం చేసుకోవద్దని సూచించారు. దీంతో ఇకపై ఏ పార్టీ వారైనా అసభ్యకరంగా పోస్టులు పెడితే వారిపై చర్యలు కఠినంగానే ఉండనున్నాయని తెలుస్తోంది.
