- Advertisement -

కోట్ల కుటుంబానికి చెక్ పెట్టిన బాబు!

- Advertisement -

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో బెయిల్‌పై ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు తిరిగి జైలుకు వెళ్లేలోపే అన్నింటిని చక్కదిద్దే పనిలో పడ్డారు. ప్రధానంగా రాయలసీమపై దృష్టి సారించిన బాబు…సీమ బాధ్యతలను బాలయ్యకు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక నియోజకవర్గాల వారిగా గెలుపు గుర్రాలను వెతికే పనిలో పడ్డారు. టీడీపీకి బలం ఉండి గెలుపు ఖాయమనే చోట బలమైన అభ్యర్థులను దించేందుకు కసరత్తు చేస్తున్నారు.అవసరమైతే సీనియర్ నేతలను వదులుకునేందుకు రెడీ అవుతున్నారు.

ఇందులో భాగంగా కర్నూల్ లోక్ సభ స్థానాన్ని ఈసారి ఎలాగైన దక్కించుకోవాలని చూస్తున్న టీడీపీ..సీనియర్, గట్టి పట్టున్న కోట్ల కుటుంబాన్ని వదులుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దివంగత మాజీ సీఎం కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి తనయుడు కోట్ల సూర్యప్రకాశ్‌కు ఈ సారి టికెట్ నిరాకరించనున్నారట. 2014,2018 ఎన్నికల్లో కోట్ల సూర్యప్రకాశ్‌కు సీట్ ఇవ్వగా ఆయన ఓడిపోయారు. దీంతో ఈసారి కొత్త అభ్యర్థిని బరిలోకి దించేందుకు సిద్ధమవుతున్నారు.

వాస్తవానికి కర్నూల్ లోక్ సభ స్థానం పరిధిలో కోట్ల కుటుంబానికి మంచి పట్టు ఉంది. కోట్ల విజయ్‌భాస్కర్ రెడ్డి మరణానంతరం 2004,2009లో విజయ్ భాస్కర్ రెడ్డి ఎంపీగా గెలిచారు. కాంగ్రెస్ హయాంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. కానీ తర్వాత రెండు ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో ఈసారి అసెంబ్లీ సీటు ఇవ్వాలని చూస్తున్నారట చంద్రబాబు. ఇందులో భాగంగా జగన్ వేసిన ఎత్తుగడను అనుసరించి బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి టికెట్ ఇవ్వాలని చూస్తున్నారట. మరి బాబు చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -