గెలుపే లక్ష్యంగా పార్టీ అభ్యర్ధుల ఎంపికలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు సీఎం జగన్. ఇప్పటికే జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో విపక్షాల మైండ్ బ్లాంక్ అవుతుండగా ఆయన ఎప్పుడు ఏ బాంబు పేలుస్తారో తెలియక తలలు పట్టుకుంటున్నారు. జిల్లాల వారీగా అభ్యర్థులను వారి పనితీరు, రిపోర్టులు, సర్వేలు ఇలా అన్ని పరిశీలించి గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తున్నారు.
వైసీపీ ఆవిర్భావం తరువాత గెలవని శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరు స్థానాలపై దృష్టి సారించిన జగన్..ప్రధానంగా శ్రీకాకుళం ఎంపీ నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారుజ ఎంపీ రామ్మోహన్ నాయుడుపై బలమైన అభ్యర్థి కోసం అన్వేషణ సాగిస్తున్నారు. ఇందులో భాగంగా అన్ని అంశాలను పరిశీలించిన వైసీపీ బాస్ ఈ సారి మహిళా అభ్యర్థిని బరిలోకి దింపుతారని ప్రచారం జరుగుతోంది.
ఎర్రన్నాయుడు వారసుడిగా వచ్చిన రామ్మోహన్ నాయుడు రెండు సార్లు ఇక్కడి నుం డి ఎంపీగా గెలిచారు. ఇక ఈ సారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న రామ్మోహన్ నాయుడు మాత్రం ఎంపీగా పోటీ చేసేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో తొలుత జగన్ ధర్మాన కృష్ణ ప్రసాద్, స్పీకర్ తమ్మినేని, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి పేర్లు పరిశీలించినా తాజాగా కొత్తపేరు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది.
శ్రీకాకుళం జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ పిరియా విజయసాయిరాజ్ ను ఎంపీగా పోటీ చేయించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. విజయకు సీటు ఇవ్వ డం ద్వారా బీసీ అందులో మహిళకు ఎంపీగా పోటీ చేసే ఛాన్స్ ఇచ్చినట్లు అవుతుందని తద్వారా సామాజిక సమీకరణలు కూడా కలిసివస్తాయని జగన్ అంచనా వేస్తున్నారు. విజయ సూర్య బలిజ వర్గానికి చెందిన మహిళా నేత.అందుకే సర్వేల ద్వారా క్షేత్ర స్థాయిలో ఫీడ్ బ్యాక్ సేకరిస్తున్నారు..ఇక ఈ నివేదికల ఆధారంగా అభ్యర్ది ఎవరనేది ఖరారు చేసే అవకాశం అవకాశం కనిపిస్తోంది.
