రెబల్స్ బెడదతో టీడీపీకి భంగపాటు తప్పేలా కనిపించడం లేదు. పలు నియోజకవర్గాల్లో సీటు ఆశీంచి భంగపడ్డ నేతలు టీడీపీ రెబల్స్‌గా బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు. ఇది ఖచ్చితంగా టీడీపీకి డ్యామేజ్ కానుండగా మరికొంతమంది నేతలు మాత్రం పోటీకి దూరమైన టీడీపీ అభ్యర్థి ఓటమి కోసం పనిచేస్తామని బహిరంగంగా చెబుతున్నారు.
ఇక అనంతపురం అర్బన్‌లో ముఖ్యంగా టీడీపీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌కు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి రూపంలో గట్టి సవాల్ ఎదరవుతోంది. ఇదే ఇప్పుడు వైసీపీ అభ్యర్థి అనంత వెంకట్రామిరెడ్డి విజయానికి బాటలు వేయనుందని స్థానికంగా ప్రచారం జరుగుతోంది.
నాలుగు సార్లు ఎంపీగా పనిచేసిన వెంకట్రామిరెడ్డికి రాజకీయ అనుభవంతో పాటు ప్రజలను ఇట్టే కలుపుకుపోతారు. అందుకే ప్రచారంలో టీడీపీ అభ్యర్థి కంటే ముందున్నారు వెంకట్రామిరెడ్డి. దీనికి తోడు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి శిబిరంలో టీడీపీ అభ్యర్థి దగ్గుబాటిపై నెలకొన్న అసంతృఫ్తి వెంకట్రామిరెడ్డి విజయావకాశాలను మరింత మెరుగుపర్చాయి. దీంతో రెండోసారి వెంకట్రామిరెడ్డి గెలవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇక దగ్గుబాటికి పార్టీలోని అన్ని వర్గాల కార్యకర్తలను కలుపుకునిపోవడం సవాల్‌గా మారింది. దీనికి తోడు మిత్రపక్షాలైన జేఎస్పీ, బీజేపీ కేడర్‌ని కలుపుకుని పోవడం తలకు మించిన భారంగా మారింది. మొత్తంగా టీడీపీ నేతల మధ్య పోరు వైసీపీకే లాభం చేకూరనుంది.
