- Advertisement -

పేరు మార్చుకుంటున్నా:ముద్రగడ

- Advertisement -

పిఠాపురంలో పవన్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని ప్రకటించిన కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చెప్పిన విధంగానే తన పేరు మార్చుకుంటున్నానని చెప్పారు. ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పేరు మార్పు కోసం గెజిట్ దరఖాస్తు చేసుకున్నానని చెప్పారు. ఇందుకు సంబంధించిన పత్రాలను చూపించారు.

పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌ను ఓడించలేనందుకు చింతిస్తున్నానని…అయితే పవన్ కళ్యాణ్‌పై చేసిన సవాల్‌కు కట్టుబడి ఉన్నానంటున్నారు. పవన్‌ను ఓడిస్తానని ఛాలెంజ్ చేసి తాను ఓడిపోయానని …వైఎస్ జగన్ కోట్లాది రూపాయలు పేదలకు సంక్షేమంతో ఆక్సిజన్ అందించారన్నారు.

ఇలాంటి సంక్షేమం పథకాలు అమలు చేయడానికి దేశంలో ఏ ముఖ్యమంత్రి సాహసం చేయలేదని…. ప్రజలు దీనిని ఎందుకు స్వీకరించలేదో అర్థం కావడం లేదన్నారు. ప్రజల కోసం కష్టపడిన జగన్ ను గౌరవించకపోవడం చాలా భాధాకరమని.. తన రాజకీయ నడక వైఎస్ జగన్‌తోనే ఉంటుందని స్పష్టం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -