- Advertisement -

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందుకే గగ్గోలు పెడుతున్నారా!

- Advertisement -

తెలంగాణ ఇచ్చిన పార్టీగా పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. అయితే అధికారంలోకి రావడం బాగానే ఉన్నా ఆ పార్టీ ప్రజాప్రతినిధులు మాత్రం తీవ్ర అసంతృప్తిలో ఉన్నారట. ఎందుకంటే ప్రజాప్రతినిధులమైన తమను పట్టించుకోవడం లేదని రగిలిపోతున్నారట.

మంత్రులే కాదు అధికారులు సైతం తమ మాట వినడం లేదని చెబుతున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు. మరికొంతమంది ఎమ్మెల్యేలు అయితే కనీసం తమ నియోజకవర్గాల్లో జరిగే సమావేశాలకు సంబంధించి సమాచారం ఇవ్వడం లేదని, అసలు ప్రొటోకాల్ ఉందా అని బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు.

ఇప్పటికే నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం..స్పీకర్‌ని కలిసి తన గోడు వినిపించగా తాజాగా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. పదేళ్లు బీఆర్ఎస్ లో అవమానాలు భరించలేకనే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చామని ఇక్కడా అదే పరిస్థితి ఎదురవుతోందన్నారు. కార్పొరేషన్ చైర్మన్ల పరిస్థితి అంతే. పవర్ లేని పదవి తీసుకొని తప్పు చేశామని బాధపడుతున్నారు.

అధికారులే కాదు ఎమ్మెల్యేలు చెబితే పోలీసులు కూడా వినని పరిస్థితి నెలకొనడంతో తామసలు ప్రజాప్రతినిధులమేనా అన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు
మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి విషయంలోనూ ఇదే సిచ్యువేషన్ ఉండటంతో వీరంతా సీఎం రేవంత్ దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లేందుకు చూస్తున్నారట. ఏదిఏమైనా కాంగ్రెస్ ఎమ్మెల్యేల అసంతృప్తి మాత్రం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -