తాను తిరిగి పాదయాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు వైసీపీ అధినేత,మాజీ సీఎం జగన్. వైయస్‌ఆర్‌సీపీ యూత్ వింగ్ సమావేశంలో మాట్లాడిన జగన్.. 2019 ఎన్నికలకి ముందు పాదయాత్ర చేసి దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో చారిత్రక విజయం సాధించినట్లు గుర్తు చేశారు.
రాబోవు ఎన్నికలకి ముందు మళ్లీ పాదయాత్రతో ప్రజల చెంతకి వెళ్లబోతున్నట్లు తెలిపారు జగన్. పార్టీ పెట్టిన సమయంలో నాతో కలిసి వస్తామని చెప్పిన వారిని రాజీనామా చేసి.. ఆ తర్వాత రమ్మన్నాను , ఉప ఎన్నికల్లో నేను అత్యధిక మెజార్టీతో గెలిచి ప్రమాణం స్వీకారం చేస్తున్నప్పుడు.. పార్లమెంట్‌లో ప్రతి తల నా వైపు చూసింది అన్నారు.
వైయస్‌ఆర్‌సీపీలో యూత్ వింగ్ అనేది చాలా క్రియాశీలకమైంది…. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని నిలదీయడంలో యువతది కీలక పాత్ర అన్నారు జగన్. పార్టీలో లీడర్లుగా ఎదిగేందుకు ఇప్పుడు యువతకి గొప్ప అవకాశం ఉంది అని దిశానిర్దేశం చేశారు.
