మహారాష్ట్రలో హిందీ భాష – మరాఠీ భాష మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. ఇప్పటికే మోడీ టార్గెట్‌గా ఠాక్రే బ్రదర్స్ విమర్శలు గుప్పించగా వీరికి బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మహారాష్ట్రలో ఎంఎన్ఎస్ కార్యకర్తలు హింసాత్మక ఘటనలకు పాల్పడిన నేపథ్యంలో తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
రాజ్ ఠాక్రేకు గూండాయిజం ఒక్కటే మిషన్….ప్రజల మద్దతు రాకపోతే గూండాలను ముందుకు తోస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. . మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటమి భయంతో ఆయన ఈ రకమైన పనులు చేస్తున్నారు అని విమర్శించారు. 2007లో జరిగిన ఒక ఘటన వివరాలను పంచుతూ, బీహార్‌కు చెందిన విద్యార్థిపై ఎంఎన్ఎస్ కార్యకర్తలు దాడి చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఆ పేజీ స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్ చేశారు.
ముంబై కార్పొరేషన్ ఎన్నికల ముందు, ఓటమి భయంతో ఎప్పుడూ రాజ్ ఠాక్రే గూండాయిజానికి దిగతారు. ప్రజలు అండగా లేనప్పుడు గూండాలను ముందుకు పంపటం ఆయన పని అని దుయ్యబట్టారు. నా వ్యతిరేకత రాజ్ ఠాక్రే గూండాయిజానికి మాత్రమే… సహనానికి హద్దులు దాటిపోయాయి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముంబైలోని వోర్లీ ప్రాంతంలో వ్యాపారవేత్త సుశీల్ కేడి కార్యాలయంపై దాడికి పాల్పడ్డ కేసులో ఐదుగురు ఎంఎన్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై భారతీయ న్యాయ సంహిత (BNS) 2023 కింద సెక్షన్లు 223, 189(2), 189(3), 190, 191(2), 191(3), 125 కింద కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
