- Advertisement -

జ్యోతిష్కుడి ముసుగులో లైంగిక దాడులు!

- Advertisement -

మహారాష్ట్రలో జ్యోతిష్కుడి ముసుగులో మహిళలను మోసం చేసి లైంగిక దాడులకు పాల్పడుతున్న నకిలీ బాబా వ్యవహారం వెలుగులోకి రావడంతో కలకలం రేగింది. నాసిక్ పోలీసులు అశోక్ ఖరాత్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతను తాను రిటైర్డ్ మర్చంట్ నేవీ ఉద్యోగి అని చెప్పుకుంటూ జ్యోతిష్కుడిగా చెలామణి అవుతున్నాడు.

వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోసం వచ్చిన 35 ఏళ్ల మహిళను నమ్మబలికి అతను అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

నిందితుడి ఫామ్‌హౌస్‌లో సోదాలు నిర్వహించిన పోలీసులు షాకింగ్ విషయాలను బయటపెట్టారు.మరో 58 మంది మహిళలకు సంబంధించిన అసభ్యకర వీడియోలు అక్కడ లభ్యమయ్యాయి.అశోక్ ఖరాత్‌కు కొంతమంది రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఈ కేసు తీవ్రత దృష్ట్యా మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను ఏర్పాటు చేసింది. అన్ని కోణాల్లో విచారణ జరిపి పూర్తి వివరాలు వెలికితీయాలని ఆదేశించింది. ఈ ఘటనతో నకిలీ బాబాల మోసాలు, మహిళల భద్రతపై మళ్లీ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -