గోదావరి, పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొరుగు రాష్ట్రాలు చేపట్టిన ప్రాజెక్టులతో మిగులు నీటి లభ్యత ప్రశ్నార్థకమని ప్రశ్నించారు. గోదావరికి అతిపెద్ద ఉపనది అయిన ప్రాణహిత నదిని ఎగువ రాష్ట్రాలు ఉపయోగిస్తున్నాయి అన్నారు.
ఇంద్రావతి-ప్రాణహితను ఒక జాతీయ ప్రాజెక్టుగా చేపట్టడానికి కేంద్రం చత్తీస్ గఢ్ కు రూ.50 వేల కోట్లు కేటాయించింది అన్నారు. పోలవరం ఆనకట్ట ఎత్తు విషయంలో చంద్రబాబు రాజీ పడ్డారు.. 45.72 మీటర్ల ఎత్తును 41.15 మీటర్లకు పరిమితం చేయడాన్ని అంగీకరించారు అన్నారు.
ఇండోసోల్ అనే కంపెనీకి చేవూరు, రేవూరు ప్రాంతంలో 5వేల ఎకరాలు కేటాయించాం. వారు ఆ స్థలంలో నిర్మాణాలు కూడా ప్రారంభించారు. రైతులు కూడా ఇష్టపూర్వకంగా భూములు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇండోసోల్ ను పొమ్మనకుండా పొగపెడుతున్నట్టుగా భూములు ఇచ్చిన ప్రాంతంలో కాకుండా కరేడు ప్రాంతంలో భూములిస్తామని చెబుతోంది అన్నారు. రెండు పంటల పండే కరేడు ప్రాంతంలో రైతులకు తమ భూములివ్వడం అసలు ఇష్టం లేదు. 42వేల కోట్ల పెట్టుబడులు, 8 వేల ఉద్యోగాలు ఏమవ్వాలి? ప్రాజెక్టులు రావాలనా? పంపేయాలనా? చెప్పాలన్నారు.
