- Advertisement -

నెల్లూరులో జనసేన నేత అరాచకం

- Advertisement -

ఏపీలో జనసేన నేత రెచ్చిపోయాడు. ఓ మహిళ జాకెట్ చింపేసి, చీర లాగేసి దారుణంగా కొట్టాడు జనసేన నేత. ఇప్పుడు ప్రభుత్వం మాది, మమ్మల్ని ఏం చెయ్యలేరంటూ వార్నింగ్ ఇచ్చారు జనసేన నేత వెంకటరావు.

నెల్లూరు జిల్లా ఏఎస్ పేట పీఎస్ పరిధిలోని పెద్ద హబీపురం గ్రామంలో అనసూయమ్మ అనే మహిళ పొలంలో నుండి జేసీబీతో అక్రమంగా రోడ్డు వేశారు జనసేన నేత ఊస వెంకటరావు.

తమ పొలంలో నుండి అక్రమంగా రోడ్డు వేయడం ఏంటని జేసీబీని అడ్డుకున్నారు అనసూయమ్మ, ఆమె కొడుకు సాయినాథ్. దీంతో ఆగ్రహించి అనసూయమ్మ జాకెట్ చింపేసి, చీర లాగేసి, మెడలోని బంగారు సరుడును లాక్కొని దారుణంగా కొట్టాడు జనసేన నేత.

తాను జనసేన పార్టీ నేతను అని, ఇప్పుడు ప్రభుత్వం మాది అని, నన్ను ఏం చెయ్యలేరని వార్నింగ్ ఇచ్చారు వెంకటరావు. అనసూయమ్మ ఫిర్యాదు మేరకు వెంకటరావు, అతని కుటుంబసభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఏఎస్ పేట పీఎస్ పోలీసులు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -