- Advertisement -

ఢిల్లీ హైకోర్టుకు ఐష్‌..ఎందుకో తెలుసా?

- Advertisement -

బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ మంగళవారం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన పర్సనాలిటీ రైట్స్‌ను రక్షించాలని, అలాగే అనుమతి లేకుండా తన పేరు, ఫొటోలు లేదా AI ద్వారా సృష్టించిన కంటెంట్‌ను అవమానకరంగా వాడకుండా నిరోధించాలని ఆమె కోరారు.

ఐష్‌ తరఫున సీనియర్ అడ్వకేట్ సందీప్ సేథి వాదిస్తూ, ఆమె ప్రచార హక్కులు మరియు వ్యక్తిత్వ హక్కులను అమలు చేయాలన్న ఉద్దేశంతో ఈ పిటిషన్ వేశారని తెలిపారు. ఎవరూ ఆమె ఫొటోలు, రూపం, పేరు అనుమతి లేకుండా వాడే హక్కు లేదు. కేవలం నా పేరు, ఫొటో వాడి డబ్బు సంపాదిస్తున్నారు. ఇది అత్యంత దురదృష్టకరం అని ఆయన కోర్టులో వాదించారు. ఆమె పేరు, ఫొటోలను ఎవరో తమ లైంగిక కోరికలు తీర్చుకోవడానికి వాడుతున్నారు అని వ్యాఖ్యానించారు.

జస్టిస్ తేజస్ కారియా మాట్లాడుతూ, ఐశ్వర్య రాయ్ బచ్చన్ అనుమతి లేకుండా ఆమె చిత్రాలు, వ్యక్తిత్వాన్ని వాడుతున్న ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్ములు, వ్యక్తులపై నిషేధం విధించే అవకాశం ఉందని సూచించారు. ప్రతి ఒక్క డిఫెండెంట్‌పై ఆర్డర్లు జారీ చేస్తాము. పిటిషన్‌లో ఉన్న డిమాండ్లు విస్తృతంగా ఉన్నందున ఒకే ఆర్డర్ ఇస్తే బాగుంటుంది. లేకుంటే వేర్వేరుగా ఇంజంక్షన్లు జారీ చేస్తాము అని కోర్టు తెలిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -