- Advertisement -

పాక్‌తో మాకు పోటీ ఏంటీ?

- Advertisement -

పాక్‌తో తమకు పోటీ ఏంటో చెప్పాలన్నారు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. పాక్‌తో గెలుపు అనంతరం మాట్లాడిన సూర్య.. 7వ నుంచి 15వ ఓవర్ల వరకు మేము వారికంటే మంచి క్రికెట్ ఆడామని, అలాగే బౌలింగ్ విషయంలోనూ మేమే పైచేయి సాధించామని నేను భావిస్తున్నాను అన్నారు. ఇటీవలి కాలంలో భారత్ వరుసగా 7 విజయాలు సాధించడం గణాంకాలే చెబుతున్నాయి అని చెప్పారు.

ప్రతిసారీ ఈ ప్రశ్న అడగడం ఆపేయాలి… ఒకవేళ రెండు జట్లు 15–20 మ్యాచ్‌లు ఆడి 7–7 లేదా 8–7 గా ఉంటేనే దాన్ని రైవల్రీ అంటారు. కానీ 13–0, 10–1 లాంటి గణాంకాలు ఉంటే దాన్ని రైవల్రీ అనలేం అని సూర్యకుమార్ వ్యాఖ్యానించారు. రైవల్రీ అంటే ఏమిటో నాకు తెలియదు… మైదానంలోకి వెళ్ళాక స్టేడియం నిండిపోవడమే నాకు కనిపిస్తుంది. అప్పుడు నేనంటాను, ఇప్పుడు ఎంటర్టైన్‌మెంట్ టైమ్ వచ్చింది అని చెప్పారు.

సెప్టెంబర్ 14న మేము చివరిసారి ఆడిన తర్వాత వికెట్ మెరుగ్గా మారింది… ఈరోజు బ్యాటింగ్‌కి సౌకర్యంగా ఉండి కొంచెం కఠినంగానూ అనిపించింది. 7–15 ఓవర్ల మధ్య బాగా ఆడిన జట్టుకే పైచేయి వస్తుంది అని అన్నారు. భారత్ ఈ మ్యాచ్‌లో నాలుగు క్యాచ్‌లు వదిలేసింది. 2022 T20 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాలో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లోనూ ఇలాగే నాలుగు క్యాచ్‌లు వదిలారు. అయితే సూర్యకుమార్ ఈ విషయాన్ని సరదాగా తీసుకున్నారు.

సూపర్ 4 మ్యాచ్‌లో భారత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీనిపై సూర్యకుమార్ ఇలా చెప్పారు.40 ఓవర్లంతా వికెట్ ఒకేలా ఉంటుందని నేను భావించాను. నిజంగానే అలాగే జరిగింది. లైట్స్‌లో బ్యాటింగ్ ఎప్పుడూ బెటర్‌గానే ఉంటుంది. అందుకే బౌలింగ్ ఎంచుకున్నాం అని చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -