భారత జట్టు వన్డే (ODI) కెప్టెన్‌గా రోహిత్ శర్మను తప్పించారు. అక్టోబర్ 19న పర్థ్‌లో ప్రారంభమయ్యే ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు శుభ్‌మన్ గిల్ కొత్త కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. 38 ఏళ్ల రోహిత్ కెప్టెన్సీ నుంచి తప్పించబడడం అతని జట్టులో భవిష్యత్తుపై, ముఖ్యంగా 2027 వన్డే వరల్డ్‌కప్‌లో అతని పాల్గొనడం పై ప్రశ్నలను రేకెత్తించింది. అజిత్ ఆగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ రోహిత్, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్లపై తమ ప్రణాళికలను ఇంకా వెల్లడించలేదు.
భారత మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్, రోహిత్‌కు సన్నిహిత మిత్రుడు, ఈ కెప్టెన్సీ మార్పు విషయంపై స్పందిస్తూ “నా దృష్టిలో ఒకటే విషయం ఉంది. ఈ చర్చ అతనితో (రోహిత్‌తో) జరిగి ఉంటే, అతను కూడా అంగీకరించి ఉంటే — ‘అవును, భవిష్యత్తు వైపు చూడాలి, శుభ్‌మన్ గిల్‌కు అవకాశం ఇవ్వాలి, నేను అతనికి అండగా ఆ డ్రెస్సింగ్‌రూమ్‌లో ఉంటాను అని చెప్పి ఉంటే, నేను పూర్తిగా ఆ నిర్ణయానికి మద్దతిస్తాను అని నాయర్ చెప్పారు.
గిల్‌ను కెప్టెన్‌గా నియమించడం సరైన నిర్ణయమని పేర్కొన్నారు. అది అద్భుతమైన నిర్ణయం అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మీరు రోహిత్‌ను (కెప్టెన్‌ను) ఈ ప్రక్రియలో భాగం చేశారు. ఇప్పటి వరకు నువ్వు చేసినట్టే ఈ జట్టును ముందుకు నడిపించడంలో మాకు సహాయం చెయ్ అని మీరు బాధ్యత ఇచ్చారు. అతను ఆ గౌరవానికి అర్హుడు. ఆ విషయం మీద మాత్రం రోహిత్ మాత్రమే సమాధానం చెప్పగలడు. దాని మించి ఏ నిర్ణయం తీసుకున్నా తప్పు కాదు. ..అలాగే గిల్ నాయకత్వ సామర్థ్యం గురించి మాట్లాడుతూ, “శుభ్‌మన్ గిల్ ఒక రోజు కెప్టెన్ అవుతాడని మేమందరం తెలుసు. అతను అర్హుడే, ఎందుకంటే అతను అలాంటి ఆటగాడు అని నాయర్ అన్నారు.
రోహిత్ 2027 వరల్డ్‌కప్ దృష్టిలో ఉంచుకుని సిద్ధమవుతున్నాడని నాయర్ వెల్లడించారు. అతను కష్టపడి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, లక్ష్యం 2027 వన్డే వరల్డ్‌కప్‌లో భారత్ గర్వించేటట్లు ప్రదర్శన ఇవ్వడమే. భారత్‌లో అది సాధ్యంకాలేదు. కాబట్టి ఆ కమ్యూనికేషన్ సక్రమంగా జరిగి, రోహిత్ కూడా సెలెక్టర్లతో, టీమ్ మేనేజ్‌మెంట్‌తో ఒకే పేజీలో ఉన్నాడని నేను ఆశిస్తున్నాను అని అన్నారు. ఆస్ట్రేలియాతో జరగబోయే ఈ సిరీస్ శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో భారత క్రికెట్‌కు కొత్త యుగానికి నాంది అవుతుంది అన్నారు.
