- Advertisement -

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు

- Advertisement -

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. బీసీలకు 42% రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించింది. బీసీలకు 42% రిజర్వేషన్లను జీవో నెంబర్ 9లో ఇచ్చింది ప్రభుత్వం. జీవో నెంబర్ 9పై స్టే విధించింది హైకోర్టు.

ఈ జీవో ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చింది ప్రభుత్వం. దీనిపై కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వానికి 4 వారాలు సమయం ఇవ్వగా కోర్టు ఆర్డర్ కాపీ వచ్చాక స్థానిక సంస్థల ఎన్నికలపై ఈసీ నిర్ణయం తీసుకోనుంది.

ప్రభుత్వం తరఫున హైకోర్టులో రవివర్మ కుమార్ వాదనలు వినిపించారు. 50 శాతానికి మించి రిజర్వేషన్ల పెంపుకు సరైన కారణాలు ఉన్నాయి.. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని రాజ్యాంగంలో ఎక్కడా లేదు…ప్రత్యేక పరిస్థితుల్లో రిజర్వేషన్లు పెంచుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అని రవివర్మ కుమార్ తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -